ICMR Study On Omicron: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారినపడిన వారిలో వస్తున్న రోగనిరోధక స్పందన గణనీయంగా ఉంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనం వెల్లడించింది. ఈ రోగనిరోధకత ఒమిక్రాన్ పైనే కాకుండా.. డెల్టా సహా ఇతర ఆందోళనకర వేరియంట్ల పైనా సమర్థంగా పని చేస్తున్నట్లు తెలిపింది. దీంతో డెల్టా రకం వల్ల మళ్లీ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా చేసే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఈమేరకు ఒమిక్రాన్‌కు ప్రత్యేక టీకా వ్యూహం అవసరాన్ని అధ్యయనం నొక్కిచెప్పింది.
ఐసీఎంఆర్.. ఒమిక్రాన్ బారినపడిన 88 మందిపై ఈ అధ్యయనం చేపట్టింది. ఇందులో ఆరుగురు టీకా తీసుకోనివారున్నారు. వీరిలో మొత్తం 28 మంది విదేశాల నుంచి వచ్చిన వారు కాగా.. 11 మంది వారికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. అయితే టీకా పొందని వారిలో తక్కువ రోగ నిరోధక స్పందన కనిపించింది. ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు ప్రగ్యా డి.యాదవ్, గజానన్ ఎన్. సపష్కాల్, రీమా ఆర్. సహాయ్, ప్రియా అబ్రహం తదితరులు ఈ అధ్యయనం చేపట్టారు.
ఇదీ చూడండి: డ్రోన్ల ధ్రువీకరణ పథకంపై కేంద్రం నోటిఫికేషన్ జారీ