NIN Jobs In Hyderabad : ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) పరిధిలోని ఎన్ఐఎన్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ న్యూట్రిషన్)లో జాబ్ చేయాలని అనుకునే వారికి ఓ శుభవార్త. వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 116 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టులు ఇవే..
- టెక్నికల్ అసిస్టెంట్: 45 ఖాళీలు
- టెక్నిీషియన్-1: 33 ఖాళీలు
- లేబరేటరీ అటెండెంట్-1: 38 ఖాళీలు
పే-స్కేల్..
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి పే స్కేల్ నిబంధనల ప్రకరాం లెవల్-6 కింద రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం ఉంటుంది.
- టెక్నీషియన్-1కు లెవెల్-2 కింద రూ.19,900 నుంచి రూ.63,200 వరకు శాలరీ ఉంటుంది.
- లేబరేటరీ అటెండెంట్-1 ఉద్యోగస్థులకు లెవెల్-1 కింద రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతభత్యాలు ఉంటాయి.
ఎవరు అర్హులు..?
ఎన్ఐఎన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పైన తెలిపిన పోస్టుల నియామకానికి సంబంధించి డిగ్రీ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్‌లో ఏ స్ట్రీమ్ వారు అప్లై చేసుకోవచ్చు..? దరఖాస్తు రుసుము ఎంత ఉంటుంది..? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది..? అనే పూర్తి వివరాలను ఈనెల 24వ తేదీన ప్రకటిస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేన్తో పాటు అప్లికేషన్ లింక్‌ను కూడా అదేరోజు అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తారు. కాగా, అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఎన్ఐఎన్ వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాల కోసం www.nin.res.org సైట్‌ను వీక్షించొచ్చు.
దరఖాస్తు చివరితేదీ..
14 ఆగస్టు 2023 వరకు మూడు విభాగాల్లోని పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటీస్ ఉద్యోగాలు..
Vizag Steel Plant Apprentice Recruitment 2023 : మరోవైపు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో 2023 ఆగస్టు బ్యాచ్‌కు సంబంధించి 250 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వివిధ విభాగాల్లో ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ అప్రెంటీస్ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు. డిప్లొమా, బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ఉన్న అభ్యర్థులను ముందుగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి అందులో క్వాలిఫై అయిన వారిని అప్రెంటీస్ పద్ధతిలో ఉద్యోగాలకు తీసుకుంటారు. ఈ పోస్టులకు సంబంధించి జీతభత్యాలు ఏంటి, దరఖాస్తు రుసుము ఎంత, చివరి తేదీ ఏంటి.. అనే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి.