ETV Bharat / bharat

జనం డబ్బుతో ఆన్​లైన్ గేమ్స్​.. రూ.2.4కోట్లు మాయం చేసిన బ్యాంక్ అధికారి - ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ చేతివాటం

ఆన్​లైన్ గేమ్​లకు బానిసైన ఓ ప్రైవేట్​ బ్యాంక్ అధికారి.. కస్టమర్ల సొమ్మును కాజేశాడు. రూ.2.36 కోట్ల కస్టమర్ల డబ్బులను సొంత అవసరాల కోసం వాడుకునేందుకు ప్రయత్నించారు. ఆఖరికి పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

bank officers fraud
ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ చేతివాటం
author img

By

Published : Feb 26, 2023, 1:16 PM IST

కర్ణాటకలోని హావేరిలో ఐసీఐసీఐ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ చేతి వాటం ప్రదర్శించాడు. ఆన్​లైన్​ గేమ్​లకు బానిసైన అతడు బ్యాంకు కస్టమర్ల సొమ్మును కాజేశాడు. ఆఖరికి పోలీసులకు చిక్కాడు. అసలేం జరిగిందంటే?
వీరేశ్ కాశీమత్​ అనే వ్యక్తి ఐసీఐసీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్​గా పనిచేస్తున్నాడు. అయితే అతడికి బాగా ఆన్​లైన్​ గేమ్​లు ఆడే అలవాటు ఉంది. దీంతో ఖాతాదారులు తమ అకౌంట్​లో డిపాజిట్ చేసిన డబ్బును తనకు కావాల్సిన వ్యక్తి ఖాతాలో జమ చేశాడు. బ్యాంక్‌లో లెక్కలు తేడా రావడం గమనించిన మేనేజర్ షహర్ అనుమానంతో అసిస్టెంట్ మేనేజర్ వీరేశ్​పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు బ్యాంక్‌లో 2 కోట్ల 36 లక్షల రూపాయలు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీని వెనక నిందితుడు వీరేశ్ హస్తం ఉందని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ డబ్బుతో వీరేష్‌ ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేవాడని ఎస్పీ శివ కుమార్ తెలిపారు. రూ.రెండు కోట్లకు పైగా అక్రమాలు జరిగినందున వీలైనంత త్వరగా కేసును సీఐడీకి బదిలీ చేస్తామని ఎస్పీ వెల్లడించారు.

ఐసీఐసీఐ బ్యాంకులో కస్టమర్లు వేసిన డబ్బుల్ని తనకు కావాల్సిన వారి ఖాతాలో వీరేశ్ జమ చేశాడు. వినియోగదారుల ఖాతాల్లోన్ని తేడాలు రావడం వల్ల ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ షహర్ ఫిర్యాదు చేశారు. వీరేశ్​ కాశీమఠ్ ఏకంగా రూ.2.36 కోట్లను వినియోగదారుల ఖాతాల నుంచి దారి మళ్లించాడు. 2022 ఆగస్టు నుంచి 2023 ఫిబ్రవరి వరకు వీరేశ్​ ఈ మోసానికి పాల్పడ్డాడు. నిందితుడు వీరేష్ నుంచి రూ.32లక్షలను స్వాధీనం చేసుకున్నాం. కేసును వీలైనంత త్వరగా సీఐడీకి అప్పగిస్తాం. వీరేశ్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించాం.

--శివ కుమార్​, ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.