IBPS CRP RRB notification : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. (IBPS) గ్రామీణ బ్యాంకుల్లో అంటే రీజినల్ రూరల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఖాళీలను భర్తీ చేయనుంది. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులను ఇది సువర్ణ అవకాశం అనే చెప్పాలి.
భారీ స్థాయిలో పోస్టులు?
ఐబీపీఎస్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ - XII ద్వారా 8612 గ్రూప్ ఎ ఆఫీసర్ (స్కేల్ 1, 2, 3) పోస్టులను, గ్రూప్ బి - ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టులను భర్తీ చేయనుంది.
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) - 5538 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్ 1 (ఏఎం) - 2485 పోస్టులు
- జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) స్కేల్ 2 - 332 పోస్టులు
- ఐటీ ఆఫీసర్ స్కేల్ 2 - 68 పోస్టులు
- ఆగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్ 2 - 60 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్ 3 (సీనియర్ మేనేజర్) - 73 పోస్టులు
- సీఏ ఆఫీసర్ స్కేల్ 2 -21 పోస్టులు
- లా ఆఫీసర్ స్కేల్ 2 - 24 పోస్టులు
- ట్రెజరీ మేనేజర్ స్కేల్ 2 - 8 పోస్టులు
- మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 2 - 3 పోస్టులు
IBPS qualifications: విద్యార్హతలు, వయోపరిమితి ఏమిటి?
ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్థులకు బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, లా, సీఎ లాంటి విద్యార్హతలు ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే..
- ఆఫీసర్ స్కేల్ 3 (సీనియర్ మేనేజర్)లకు 21 నుంచి 40 ఏళ్లు
- ఆఫీసర్ స్కేల్ 2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు
- ఆఫీసర్ స్కేల్ 1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 నుంచి 28 ఏళ్లు
IBPS exam pattern : పరీక్ష విధానం ఎలా ఉంటుంది?
ఆన్లైన్లో మొదటగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. తరువాత మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి, మెరుగైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది.
దరఖాస్తు గడువు, పరీక్ష తేదీల వివరాలు:
IBPS CRP RRB పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈ 2023 జూన్ 1న ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 21లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
IBPS exam dates :
⦁ ప్రిలిమినరీ పరీక్ష: 2023 ఆగస్టు
⦁ మెయిన్ పరీక్ష: 2023 సెప్టెంబర్
ఇంటర్వ్యూ తేదీలు:
- ఆఫీసర్ స్కేల్ 1, 2 ,3 లకు: 2023 అక్టోబర్/ నవంబర్ 2023
- ప్రొవిజనల్ అలాట్మెంట్: 2024 జనవరిలో ఉంటాయి.
దరఖాస్తు రుసుము ఎంత?
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175/-
- మిగతా అభ్యర్థులకు రూ.850/-
- పూర్తి వివరాలకు IBPS అధికారిక వెబ్సైట్ను సందర్శించగలరు.
ఇవీ చదవండి: