IB Recruitment 2023 : ఉద్యోగార్థులకు శుభవార్త వినిపించింది కేంద్ర హోం శాఖ. తమ శాఖలోని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 677 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా.. దరఖాస్తులను అక్టోబర్ 14 నుంచి స్వీకరించనున్నారు. అర్హత ఉండి ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 14 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు..
IB Vacancy 2023 : 677 పోస్టులు
పోస్టులు.. ఖాళీలు..
- సెక్యురిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్పోర్ట్(డ్రైవర్)- 362 ఖాళీలు
- మల్టీ-టాస్కింగ్ స్టాఫ్- 315 ఖాళీలు
ఏజ్ లిమిట్..
IB Exam Age Limit :
- సెక్యురిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్పోర్ట్(డ్రైవర్) పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు 2023 నవంబర్ 13 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 27 సంవత్సరాలు మించకూడదు.
- మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు- 18-25 ఏళ్ల మధ్య ఉండాలి (2023 నవంబర్ 13 నాటికి).
- పలు కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
కావాల్సిన అర్హతలు..
IB Exam Education Qualification :
- సెక్యురిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్పోర్ట్(డ్రైవర్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్తులు పదో తరగతి పాసై ఉండాలి. అలాగే లెర్నింగ్ మోటార్ వెహికిల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వీటితో పాటు ఏడాది పాటు డ్రైవింగ్‌లో అనుభం తప్పనిసరి.
- మల్టీ-టాస్కింగ్ స్టాఫ్- అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి.
- అభ్యర్థి దరఖాస్తు చేస్తున్న సంబంధిత రాష్ట్రం లేదా ప్రాంతం నుంచి నివాస ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
ఎంపిక విధానం (IB Exam Selection Process) :
- టైర్-1(ఆబ్జెక్టివ్)- రాతపరీక్ష
- టైర్-2(డిస్క్రిప్టివ్)- MTS పోస్టులకు మాత్రమే
- డ్రైవింగ్ స్కిల్ టెస్ట్(సెక్యురిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్పోర్ట్(డ్రైవర్) పోస్టులకు)
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ పరీక్ష
దరఖాస్తు రుసుము..
IB Application Fee :
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు- రూ.50/-
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ(పురుష) అభ్యర్థులు- రూ.500/-
జీతభత్యాలు..
IB Jobs Salary :
- సెక్యురిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్పోర్ట్(డ్రైవర్)- రూ.21,700/- నుంచి రూ.69,100/-
- మల్టీ-టాస్కింగ్ స్టాఫ్- రూ.18,000/- నుంచి రూ.56,900/-
ముఖ్యమైన తేదీలు..
IB Jobs Important Dates :
- దరఖాస్తు ప్రారంభ తేదీ- 2023 అక్టోబర్ 14
- దరఖాస్తుకు చివరి తేదీ- 2023 నవంబర్ 13
అప్లికేషన్ విధానం..
అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
జాబ్ లొకేషన్..
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఐబీ కార్యాలయాల్లో పోస్టింగ్ కల్పిస్తారు.
అధికారిక వెబ్సైట్..
IB Official Website : పరీక్ష నిర్వహణ తేదీలు, పరీక్ష సిలబస్ సహా నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం హోం శాఖ అధికారిక వెబ్సైట్ www.mha.gov.in.ను చూడవచ్చు.