IB ACIO Jobs 2023 : మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) 226 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ చేసినవారు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు
- అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2 (టెక్నికల్) - 226 పోస్టులు
- యూఆర్ - 93
- ఈడబ్ల్యూఎస్ - 24
- ఓబీసీ - 71
- ఎస్సీ - 29
- ఎస్టీ - 9
విభాగాల వారీగా పోస్టుల వివరాలు
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 79 పోస్టులు
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ - 147 పోస్టులు
విద్యార్హతలు
IB ACIO Job Qualifications :
- అభ్యర్థులు బీఈ లేదా బీటెక్ ( ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యునికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా
- అభ్యర్థులు ఎంఎస్సీ ( ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్/ కంప్యూటర్ సైన్స్) పాస్ అయ్యుండాలి. లేదా
- పీజీ (కంప్యూటర్స్ అప్లికేషన్స్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాదు గేట్ స్కోర్ - 2021/ 2022/ 2023 కూడా తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి
IB ACIO Job Age Limit : అభ్యర్థుల వయస్సు 2024 జనవరి 12 నాటికి 18 ఏళ్లు నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు రుసుము
IB ACIO Job Application Fee :
- జనరల్, ఓబీసీ, ఈడబ్లూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.200 చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక ప్రక్రియ
IB ACIO Job Selection Process : గేట్ స్కోర్/ ఇంటర్వ్యూ, సైకోమెంట్రిక్/ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులైన అభ్యర్థులను అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
IB ACIO Job Salary : ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతం అందిస్తారు. పైగా అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
దరఖాస్తు విధానం
IB ACIO Job Application Process :
- అభ్యర్థులు ముందుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అధికారిక వెబ్సైట్ https://www.mha.gov.in ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజ్‌లోని IB ACIO అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేసి, ఓపెన్ చేయాలి.
- వెంటనే ఓ కొత్త వెబ్‌పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు రిజిస్టర్ చేసుకోవాలి.
- అప్పుడు మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ జనరేట్ అవుతాయి. ఇవి మీ ఈ-మెయిల్‌కు వస్తాయి.
- ఈ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌లతో మళ్లీ వెబ్సైట్లో లాగిన్ కావాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేయాలి.
- ఆన్లైన్లోనే దరఖాస్తు రుసుము కూడా చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని, దానిని భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
IB ACIO Job Apply Last Date :
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 2023 డిసెంబర్ 12
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 జనవరి 12
- దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ : 2021 జనవరి 16
ఎల్‌ఐసీలో 250 అప్రెంటీస్ జాబ్స్- అప్లైకు మరో 8 రోజులే ఛాన్స్!
ఇండియన్ నేవీలో 910 ఉద్యోగాలు - దరఖాస్తుకు మరో 11 రోజులే ఛాన్స్!