వరుస డ్రోన్ దాడుల నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లోని జాతీయ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. శత్రు డ్రోన్లను ఎదుర్కొనేందుకు జమ్ములోని వైమానిక స్థావరంలో 'డ్రోన్ కౌంటర్ వ్యవస్థ'ను బుధవారం ఏర్పాటు చేశాయి. కొత్తగా డ్రోన్ల ద్వారా ముంచుకొస్తున్న ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థలో మార్పులు చేస్తున్నట్లు ఆధికార వర్గాలు వెల్లడించాయి. అందులో భాగంగా జమ్ము వైమానిక స్థావరంలో రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్, జామర్లను అమర్చడం సహా డ్రోన్ విధ్వంసక తుపాకులను మోహరించినట్లు తెలిపాయి.
ఈ నెల 27న జమ్మూలోని భారత వైమానిక దళ స్థావరంపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలసిందే. మరుసటి రోజు రత్నుచక్-కాలుచక్ స్థావరాలపైనా డ్రోన్ దాడికి యత్నించగా.. భారత బలగాలు తిప్పికొట్టాయి. వరుసగా నాలుగో రోజూ జమ్ములోని మూడు ప్రాంతాల్లో డ్రోన్ల సంచారం కలకలం రేపింది. భారత్‌కు చెందిన కీలక స్థావరాలపై డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ దాడులకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఇదీ చూడండి: ట్విట్టర్లో బూతు బొమ్మలు- వారిపై 10 రోజుల్లో చర్యలు!