ETV Bharat / bharat

ఐటీ దాడుల్లో రూ.400కోట్ల నల్లధనం గుర్తింపు - అక్రమ నగదు లావాదేవీలు

త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఐటీ అధికారులు సోదారు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.400 కోట్ల నల్లధనం వెలుగుచూసింది. ఈ లావాదేవీలన్నీ అక్రమ కంపెనీల ద్వారా జరిగాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటించింది.

I-T Department detects Rs 400-cr black income after raids in Tamil Nadu
ఆ రాష్ట్రంలో ఐటీ దాడులు.. రూ.400కోట్ల నల్లధనం గుర్తింపు
author img

By

Published : Mar 17, 2021, 10:29 PM IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రూ.400కోట్ల అక్రమ నగదు పట్టుబడింది. ఈ నెల 11న చెన్నై, కోయంబత్తూర్, సేలం, విరుద్​నగర్, తేనీ సహా 20 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. అక్రమ పద్ధతిలో భారీ నగదు చలామణి జరిగినట్లు గుర్తించింది.

విదేశాల ద్వారా..

వ్యవసాయ వస్తువుల అమ్మకం, కొనుగోలు ముసుగులో వివిధ సంస్థల ద్వారా రూ.100 కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరిగాయని సీబీడీటీ తెలిపింది. అంతేగాక ఈ లావాదేవీలన్నీ ఉద్యోగుల పేరుమీద జరిపినట్లు గుర్తించామంది. విదేశీ సంస్థల పెట్టుబడులు, బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డులకు సంబంధించి కీలక ఆధారాలు లభించినట్లు తెలిపింది.

లగ్జరీ కార్లు.. నగదు..

ఈ దాడుల్లో వివిధ వ్యక్తుల నుంచి.. లెక్కల్లో చూపని రూ.50 లక్షల నగదుతో పాటు.. రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.12.5 కోట్ల విలువైన ఖరీదైన 25 వాహనాలను అధికారులు సీజ్​ చేశారు. ఇప్పటివరకు సుమారు రూ.400 కోట్ల నల్లధనాన్ని గుర్తించినట్లు సీబీడీటీ తెలిపింది.

ఏప్రిల్ 6న తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి: 'ఎన్నికల వేళ రూ.331 కోట్ల అక్రమ సొమ్ము స్వాధీనం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.