ETV Bharat / bharat

'పాసవాన్​కు రాజకీయ వారసుణ్ని నేనే' - రామ్​ విలాస్ వారసుడు

దివంగత నేత రామ్​ విలాస్​ పాసవాన్​కు అసలైన వారసుడు తానే అని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి పశుపతి కుమార్​ పరాస్ పేర్కొన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

pasupati paras
పశుపతి, కేంద్ర మంత్రి
author img

By

Published : Jul 9, 2021, 5:29 AM IST

దివంగత నేత రామ్​ విలాస్ పాసవాన్​కు అసలైన వారసుణ్ని తానేనని ఆయన సోదరుడు, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి పశుపతి కుమార్ పరాస్ పేర్కొన్నారు. రామ్​ విలాస్​ ఆస్తులకు ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్ వారసుడు కావొచ్చని, కానీ రాజకీయాలకు మాత్రం కాదన్నారు.

ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ గతేడాది మరణించాక చిరాగ్ పశుపతిల మధ్య వివాదం ముదిరి ఇటీవల పార్టీలో చీలక వచ్చింది. పార్టీకి తనను జాతీయాధ్యక్షుడిగా ప్రకటించుకున్న పశుపతి కేంద్రంలోని భాజపాతో చేతులు కలిపారు. ఇటీవలే జరిగిన మంత్రివర్గ విస్తరణలో పశుపతికి పదవి దక్కింది.

గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిరాగ్ తన తప్పులపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. తన సోదరుడు రామ్ విలాస్ తనకు ఆదర్శమన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టించి... కేంద్రంలోకి...

ఎల్​జేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా పశుపతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.