Hyderabad Woman struggles Chicago Streets : ఓ యువతి విదేశాల్లో మాస్టర్స్ చేయాలనుకుంది. అనుకున్నదే తడువుగా వీసా రావడంతో అక్కడ చదివేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె వస్తువులను దొంగిలించడంలో నానా అవస్థలు పడుతోంది. చివరికి మానసిక ఒత్తిడికి గురై రోడ్లపై ఆకలితో ఆలమటిస్తోంది. ఈ విషయం ఎలాగోలా తెలుసుకున్న బాధితురాలి తల్లి తనను ఎలాగైనా భారత్‌కు రప్పించాలని కేంద్రాన్ని వేడుకుంటోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్నిఅభ్యర్థిస్తూ.. విదేశాంగ మంత్రి జై శంకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖను బీఆర్ఎస్ నాయకుడు ఖలీకర్ రెహమాన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
-
Request @DrSJaishankar to kindly look into it.@HelplinePBSK @IndiainChicago @IndianEmbassyUS @sushilrTOI @meaMADAD https://t.co/rwtevJ1fWr
— Khaleequr Rahman (@Khaleeqrahman) July 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Request @DrSJaishankar to kindly look into it.@HelplinePBSK @IndiainChicago @IndianEmbassyUS @sushilrTOI @meaMADAD https://t.co/rwtevJ1fWr
— Khaleequr Rahman (@Khaleeqrahman) July 26, 2023Request @DrSJaishankar to kindly look into it.@HelplinePBSK @IndiainChicago @IndianEmbassyUS @sushilrTOI @meaMADAD https://t.co/rwtevJ1fWr
— Khaleequr Rahman (@Khaleeqrahman) July 26, 2023
Hyderabad Woman Letter UnionMinister JaiShankar : హైదరాబాద్‌లోని మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ.. మాస్టర్స్ చేసేందుకు 2021 ఆగస్టులో అమెరికాకు వెళ్లింది. అక్కడికి వెళ్లిన ఆమె తరచూ తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. కానీ రెండు నెలలుగా కూతురు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో సయ్యదా వహాజ్ ఫాతిమా ఆవేదనకు గురైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు.. సయ్యదా లులు మిన్హాజ్ జైదీని గుర్తించి బాధితురాలి తల్లికి తెలియజేశారు.
Syeda Lulu Minhaj Zaidi Latest News : సయ్యదా లులు మిన్హాజ్ జైదీ వస్తువులను ఎవరో దొంగలించారని.. దీంతో చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోందని సమాచారాన్ని ఆమెకు అందించారు. అంతేకాకుండా సదరు యువతి మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలిపారు. దీంతో తన కుమార్తెను తిరిగి భారత్ తీసుకురావాలని వహాజ్ ఫాతిమా కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌కు లేఖ రాశారు.
Hyderabad Woman in Distress in USA : తన కుమార్తె సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అమెరికాకు మాస్టర్స్ చేసేందుకు వెళ్లిందని వహాజ్ ఫాతిమా చెప్పారు. రెండు నెలలుగా ఆమె.. తనకు ఫోన్ చేయడం లేదని తెలిపారు. హైదరాబాద్ నుంచి తమకు తెలిసిన కొందరు అమెరికాకు వెళ్లారని.. వారు చికాగోలో తన కుమార్తెను గుర్తించారని వివరించారు. ఆమె వస్తువులను దొంగతనం చేశారని వెల్లడించారు. దీంతో సయ్యదా లులు మిన్హాజ్ జైదీ ఆకలితో అలమటిస్తోందని.. తనను ఎలాగైనా భారత్‌కు తీసుకురావాలని కోరుతున్నాను అని లేఖలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి : Hyderabad Girl Killed in US Shootout : అమెరికా కాల్పుల్లో హైదరాబాద్ యువతి మృతి
చైనా జెట్ పైలట్ అత్యుత్సాహం.. అమెరికా యుద్ధ విమానంపైకి దూసుకెళ్లి..