ETV Bharat / bharat

Hyderabad Metro Offers Today : జెండా పండుగ స్పెషల్‌ .. కేవలం రూ.59లకే మెట్రోలో భాగ్యనగరం చుట్టేయండి - తెలంగాణ తాజా వార్తలు

Hyderabad Metro Offers Today : 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతున్న వేళ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (HMRL) బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కేవలం రూ.59లతో నగరం మొత్తం.. తిరగడానికి అవకాశం కల్పించింది. ఈ ఆఫర్‌ కేవలం.. ఆగస్టు 12,13,15 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇంకెందుకు ఆలస్యం మరి రూ.59లతో ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నగర ట్రాఫిక్‌ను జయించి ఆనందంగా జరుపుకోండి.

Hyderabad Metro Special Offers
Hyderabad Metro Super Saver Freedom Offer
author img

By

Published : Aug 12, 2023, 11:51 AM IST

Hyderabad Metro Offers Today : హైదరాబాద్‌ జంటనగరాల అందాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో చూపిస్తూ.. ప్రయాణికులకు కొత్త కొత్త ఆఫర్లతో సరసమైన, వేగవంతమైన ప్రయాణం అందించే హైదరాబాద్‌ మెట్రో రైలు లిమిటెడ్‌(HMRL) ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది. 'సూపర్‌ సేవర్‌ ఫ్రీడమ్‌ ఆఫర్‌' అనే పేరుతో కేవలం రూ.59లకే భాగ్యనగరంలో తిరిగేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో కస్టమర్ రాయల్టీ ప్రోగ్రామ్ ఈవెంట్ సందర్భంగా మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి ఈ ఆఫర్‌ను ప్రకటించారు.

  • Embark on a journey of freedom with Hyderabad Metro!
    Celebrate the spirit of Independence as you glide through the cityscape in style.

    Hyderabad Metro has unveiled an exciting offer for passengers today, the 'Super Saver Freedom Offer' by Mr KVB Reddy, MD & CEO - LTMRHL during a… pic.twitter.com/qcNTiBZ1UH

    — L&T Hyderabad Metro Rail (@ltmhyd) August 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Hyderabad Metro Independence Day Offer : ఆగస్టు 12, 13, 15వ తేదీల్లో మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని ఆయన ప్రకటించారు. భాగ్యనగర వాసులు ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆనందకరమైన వాతావరణంలో జరుపుకోవాలని కేవీబీ రెడ్డి ఆకాంక్షించారు. సాధారణ రోజుల్లో రూ. 99లు ఉండే ఈ సూపర్‌ ఫ్రీడమ్‌ ఆఫర్‌.. ఇప్పుడు నమ్మశక్యం కానీ రీఛార్జ్‌తో కేవలం రూ. 59లకే లభిస్తోందని వివరించారు. తమ కస్టమర్లకు ఈ ఆఫర్ అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే భాగ్యనగర ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Hyderabad Metro Record : 'మెట్రో' రైడ్ ఎంజాయ్ చేస్తున్న హైదరాబాదీలు.. 40 కోట్లు దాటిన ప్రయాణికులు

"మా విలువైన కస్టమర్‌లకు ఈ ప్రత్యేకమైన ఎస్‌ఎస్‌ఎఫ్‌(SSF) ఆఫర్‌ను అందించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ ఆఫర్‌తో చాలా తక్కువ ఛార్జీలకే హైదరాబాద్‌ నగరంలో మెట్రో ప్రయాణం చేయెచ్చు. ఈ అవకాశాన్ని హైదరాబాద్‌ ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం." - కేవీబీ రెడ్డి, హైదరాబాద్‌ మెట్రో ఎండీ

LB Nagar to Nagole metro : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఎల్బీనగర్ - నాగోల్ మెట్రో లింకు పనులు ప్రారంభం

Hyderabad Metro Super Saver Freedom Offer 2023 : లక్షల మంది ప్రయాణికులను ఆహ్లాదకరమైన వాతావరణంలో సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే హైదరాబాద్‌ మెట్రో రైల్వే వ్యవస్థకు విద్యుత్‌ వాడుకోవడమే కాదు.. అందులో సగం కరెంట్‌ తానే తిరిగి ఉత్పత్తి చేస్తోంది. మెట్రోలో రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ ద్వారా.. మెట్రోరైళ్లు నడిచేందుకు కావాల్సిన ట్రాక్షన్‌ విద్యుత్తులో 40 శాతం బ్రేకింగ్‌ సిస్టమ్‌ ద్వారానే తయారు చేసుకుంటోంది. మెట్రో గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం 36 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును మెట్రో బ్రేకింగ్‌తోనే ఉత్పత్తి చేసిందంట.

Hyderabad Metro Special Offers Today : మెట్రోలో ప్రయాణించడంతో గత ఏడాదిలో వాతావరణంలో కార్బన్‌ డై యాక్సైడ్‌(CO2) 88 మిలియన్‌ కిలోలు ఉత్పత్తి కాకుండా ఉంది. ఇది సుమారు 1750 చెట్లు విడుదల చేసే ఆక్సిజన్‌తో సమానమని గణాంకాలు చెబుతున్నాయి. మెట్రో ప్రయాణంతో 28 మిలయన్‌ లీటర్ల పెట్రోలు, డీజిల్‌ సేవ్‌ అయ్యిందంట.. 2040 ఏడాదినాటికి కర్బన ఉద్గారాలను సున్నా శాతానికి తేవాలనేది హైదరాబాద్ మెట్రో లక్ష్యం.

Best Tourist Places in Hyderabad :

  • రామోజీ ఫిల్మ్ సిటీ
  • గోల్కొండ
  • చార్మినార్‌
  • సాలార్‌ జంగ్‌ మూజియం
  • హుస్సేన్‌సాగర్
  • నూతన సచివాలయం, అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం
  • బిర్లామందిర్
  • మాధాపూర్‌, గచ్చిబౌలి ఐటీ పార్క్
  • సమతా మూర్తి విగ్రహం

KTR Delhi tour latest news : 'మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతివ్వండి'

Traction Power Generation In Metro : మెట్రో రైళ్లకు విద్యుత్‌ వాడకమే కాదు.. తయారు చేయడం తెలుసు..

MMTS: 2024 జనవరి నాటికి అందుబాటులోకి ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.