Hyderabad Drugs Case Update : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హైదరాబాద్‌లోని మాదాపూర్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సినీ ఫైనాన్సియర్ వెంకట రత్నాకర్‌రెడ్డి పాత్రపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అతనిపై డ్రగ్స్ సహా వివిధ మోసాలకు సంబంధించి 25కుపైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు.
Madhapur Drugs Case Update : ఈ కేసులో పట్టుబడిన వెంకట రత్నాకర్‌రెడ్డి పాత్రపై విచారణ జరుపుతున్న పోలీసులకు కీలక విషయాలు తెలుస్తున్నాయి. గతంలో వెంకట్ తాను ఐఆర్‌ఎస్ అధికారినంటూ మోసాలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇద్దరు సినీ నిర్మాతల 30 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక అధికారిని కూడా పెళ్లి పేరుతో మోసం చేసినట్టు బయటపడింది.
Hyderabad Rave Party Case : ఒక్కొక్కటిగా బయటపడుతున్న వెంకట్(Film Financier Venkat) లీలలు చూసి పోలీసులు కంగుతింటున్నారు. సినిమాలో అవకాశాల పేరుతో యువతులకు వెంకటరత్నాకర్ రెడ్డి వల వేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు విచారణలో నిర్ధరించారు.
Film Financier Venkat Arrest : వెంకట్ సెల్‌ఫోన్‌ను ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు. అతనితో పరిచయాలు ఉన్నవారిని కేసు దర్యాప్తులో భాగంగా ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా అసలు గుట్టు బయట పడుతుందని భావిస్తున్నారు. అయితే వెంకట్‌కు టాలీవుడ్(Tollywood Drugs Case)తో సంబంధాలున్నాయనా.. ? ఉంటే ఇందులో ఎవరెవరకి సంబంధం ఉందనే విషయంపై కూపీ లాగుతున్నారు.
Tollywood Drugs Case Update : వెంకట రత్నాకర్‌రెడ్డి ఎక్కడి నుంచి హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలు తీసుకువస్తున్నాడని కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నైజీరియన్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి వద్ద నుంచి 18 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మత్తుపదార్ధాలు కొనుగోలు చేసినవారు.. వారే సేవిస్తున్నారా, ఇంకా ఎవరికైనా విక్రయిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వారిని ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. వెంకటరత్నాకర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. ఇక వెంకట్‌తో పాటు బాలాజీ, మురళిలను కూడా పోలీసులు లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది. వారి నేర చరిత్రపైనా ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.