Flight Makes Emergency Landing: రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ విమాశ్రయం నుంచి బయలుదేరి హైదరాబాద్ రావాల్సిన విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే జైపుర్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. ఇందుకు కారణం సాంకేతిక సమస్య కాదు.. ఓ ప్రయాణికుడిపై వేడి నీళ్లు పడటం. అతడు బాధతో సిబ్బంది సాయం కోరడం వల్ల విమానం ఆగింది. ఈ ఘటన బుధవారం జరిగింది.
హైదరాబాద్‌కు చేరాల్సిన స్పైస్‌జెట్ విమానం కిషన్‌గఢ్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. అయితే ఇంతలో ఓ ప్రయాణికుడిపై ప్రమాదవశాత్తు అతని పక్కనే గ్లాస్లో పెట్టుకున్న వేడినీళ్లు ముఖం మీద పడ్డాయి. దీంతో బాధకు విలవిల్లాడిన ప్రయాణికుడు తక్షణమే తనకు చికిత్స అందిచాల్సిందిగా కోరాడు. దీంతో ఏటీసీకి సమాచారం అందించిన సిబ్బంది.. జైపుర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: రోగి పొట్టలో కాటన్ వదిలేసిన డాక్టర్.. ఆస్పత్రికి రూ.45లక్షలు ఫైన్