ETV Bharat / bharat

భార్యపై అనుమానంతో హత్య.. తల, మొండెం వేరు చేసి కాలువలో పడేసిన భర్త - Man dies while exercising

భార్యపై అనుమానంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను చంపి శరీరాన్ని ముక్కలుగా నరికి కాలువలో పడేశాడు. బంగాల్​లో ఈ ఘటన జరిగింది. మరోవైపు పదేళ్ల బాలుడిని తీవ్రంగా కొట్టాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

husband kills wife cut off wife head and body and threw it in canal in west bengal
బంగాల్​లో అనుమానంతో భార్యను నరికి చంపిన భర్
author img

By

Published : Jan 6, 2023, 9:56 AM IST

బంగాల్​లో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హతమార్చాడు ఓ భర్త. ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికేశాడు. తలను మొండాన్ని వేరు చేసి కాలువలో పడేశాడు. అనంతరం ఏమి తెలియనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జల్పాయ్​గుడి జిల్లాలోని శిలిగుడి మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహమ్మద్ ఆన్సరుల్ అనే వ్యక్తి.. తన భార్య రేణుకా ఖాతున్ (29)తో కలిసి ప్రకాశ్​ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. మొహమ్మద్ ఆన్సరుల్ రంగులు వేస్తూ జీవనం సాగిస్తుండగా.. రేణుకా ఖాతున్ బ్యూటీషియన్‌గా శిక్షణ పొందుతోంది. ఆరు సంవత్సరాల క్రితం వీరిద్దరికి వివాహం జరిగింది. గత కొద్ది రోజులుగా రేణుకా ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు భావించిన మొహమ్మద్.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు.

డిసెంబర్​ 24న భార్యను ఎవ్వరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లిన మొహమ్మద్.. ఆమెను కిరాతకంగా చంపేశాడు. ఆమె శరీరం నుంచి మొండాన్ని వేరు చేసి ఓ కాలువలో పడేశాడు. అనంతరం మరుసటి రోజు తన మామతో కలిసి భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పరివిధాలుగా విచారణ చేసిన పోలీసులు.. మొహమ్మద్​దే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తేల్చారు. అతడిని అరెస్ట్​ చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి శరీర భాగాల కోసం కాలువలో వెతుకుతున్నట్లు వారు వెల్లడించారు.

పదేళ్ల బాలుడిపై కర్రతో దాడి..
పదేళ్ల బాలుడిపై దారుణంగా దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. పిల్లవాడి కర్రతో తలపై గట్టిగా కొట్టాడు. బాలుడి చెంపలపై పలుమార్లు చేయిచేసుకున్నాడు. ఈ ఘటనంతా సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అసోంలోని గోలాఘాట్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని లక్ష్మణ్​గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ బాలుడు మేరపానీ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నట్లు వారు వెల్లడించారు.

అంత్యక్రియలు చేస్తుండగా కళ్లు తెరిచిన 81 ఏళ్ల వృద్ధురాలు..
చనిపోయిందని భావించిన ఓ 81 ఏళ్ల వృద్ధురాలు.. అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో కళ్లు తెరిచింది. దీంతో చివరి చూపుకు వచ్చిన బంధువులంతా అవాక్కయ్యారు. అయితే ఆ తర్వాత రోజే వృద్ధురాలు మరుసటి రోజే మృతి చెందింది. ఉత్తర్​ప్రదేశ్​లోని ఫిరోజాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

81 year old woman opened her eyes while performing last rites
అంత్యక్రియలు చేస్తుండగా కళ్లు తెరిచిన 81 ఏళ్ల వృద్ధురాలు

వివరాల్లోకి వెళితే.. హర్భేజీ అనే వృద్ధురాలు.. జస్రానా ప్రాంతంలోని బిలాస్‌పూర్ గ్రామంలో నివాసం ఉండేది. అనారోగ్యం కారణంగా డిసెంబర్​ 23న ఆ వృద్ధురాలిని ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. మంగళవారం ఆమె బ్రెయిన్ డెడ్​ అయ్యి మరణించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువెళ్లి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో.. అకస్మాత్తుగా​ వృద్ధురాలు కళ్లు తెరిచింది. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ ఆ తర్వాతే రోజే చనిపోయింది.

వ్యాయామం చేస్తూ వ్యక్తి మృతి..
జిమ్​ చేస్తూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది. అప్పటికే గుండెపోటుతో అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడిని ఇందోర్​ జిల్లాలోని లసుడియా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రఘువంశీగా గుర్తించారు పోలీసులు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.