ETV Bharat / bharat

భార్యాబిడ్డలను గొడ్డలితో నరికి హత్య.. పెరట్లోనే మృతదేహాలను పాతిపెట్టి.. - మధ్యప్రదేశ్ క్రైమ్ న్యూస్

కుటుంబ కలహాల కారణంగా భార్య, ఇద్దరు చిన్నారులను గొడ్డలితో నరికి పాశవికంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణం మధ్యప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువతుల్ని కారుతో ఢీకొట్టి.. కిలోమీటరు మేర వారిని ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

husband kills wife and kids
భార్యాపిల్లలను చంపిన వ్యక్తి
author img

By

Published : Jan 23, 2023, 12:18 PM IST

మధ్యప్రదేశ్ రత్లాంలో దారుణం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి హత్య చేశాడు ఓ వ్యక్తి. అనంతరం వారి మృతదేహాలను స్నేహితుడి సహాయంతో తన ఇంటి పెరట్లోనే పాతిపెట్టాడు. రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితుడు సోనూ తల్వాడేను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు. మూడు మృతదేహాలను సమాధి నుంచి బయటకు తీశారు.

"కుటుంబ కలహాల వల్లే సోనూ తల్వాడే తన భార్య, ఏడేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తెను హతమార్చాడు. సోనూ తల్వాడేకు మృతురాలు రెండో భార్య. నిందితుడు రైల్వే ఉద్యోగి. మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయి. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం రత్లాం ప్రభుత్వాస్పత్రికి తరలించాం. మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్ష చేయిస్తాం."

--పోలీసులు

స్కూటీని ఢీకొట్టి కిలోమీటర్​ ఈడ్చుకెళ్లి..
దిల్లీలో స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన తరహా ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది. కాన్పుర్​లో ఓ కారు డ్రైవర్ స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువతులను ఢీకొట్టి కిలోమీటరు​ ఈడ్చుకెళ్లాడు. కారు నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూటీపై ఉన్న ఓ యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

scooty dragged by car
నుజ్జునుజ్జైన స్కూటీ

ఇదీ జరిగింది
కౌశికి(19), పర్ధి(20) అనే ఇద్దరు యువతులు కాలేజీ నుంచి స్కూటీపై వెళ్తున్నారు. ఫసల్​గంజ్ కూడలి వద్ద యువతుల వెళ్తున్న స్కూటీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో యువతులిద్దరూ కారు బానెట్​పై ఇరుక్కున్నారు. ఒక యువతిని 500 మీటర్ల కారుతో ఈడ్చుకెళ్లి వదిలేశాడు కారు నడుపుతున్న వ్యక్తి. మరో యువతిని కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లాడు. పోలీసులు వెంటనే స్పందించి కారు నడుపుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. యువతులను మరియంపుర్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి రోహన్​ను అరెస్ట్ చేశారు పోలీసులు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.