ఉత్తర్‌ప్రదేశ్‌లో అనూహ్య (UP News today) వివాహం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో కలిసి భార్య వివాహాన్ని దగ్గరుండి జరిపించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏమైందంటే...
కాన్పుర్‌కు (Kanpur News) చెందిన కోమల్- పంకజ్లకు ఆరు నెలల క్రితం వివాహమైంది. పేరుకే పెళ్లి తప్ప.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఎలాంటి సాంగత్యం లేదు. దీంతో అసలు సమస్యేంటని భార్యను ఆరా తీశాడు పంకజ్. 'నీ సంతోషం కోసం ఏదైనా చేస్తా'నని భార్యకు మాటిచ్చాడు. దీంతో విషయం చెప్పేసింది కోమల్. పింటు అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. తన కుటుంబ సభ్యులు బలవంతంగా ఈ వివాహం జరిపించారని వివరించింది. పింటుతో ఉంటేనే సుఖంగా ఉంటానని చెప్పింది.
ఇదంతా విన్న పంకజ్.. కోపగించుకోలేదు. ప్రశాంతంగా సరేనన్నాడు. 'నువ్వు ఎవరితో సంతోషంగా ఉంటావో.. వారితో కలిసి ఉంటేనే నాకూ ఆనందం' అంటూ భార్య వివాహానికి ఏర్పాట్లు చేశాడు. ముందుగా తన కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడాడు. సంప్రదాయబద్ధంగా భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత పింటు, కోమల్‌కు వివాహం జరిపించారు. ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: అత్యాచారం విఫలం.. బాలికకు నిప్పంటించి హత్య