ETV Bharat / bharat

పెళ్లైన 12 గంటల్లోనే భార్యకు ట్రిపుల్​ తలాక్.. అవి కావాలంటూ! - triple talaq and dowry

Triple Talaq to Wife: కట్నం కోసం వేధింపులు జరిపే ఘటనలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వివాహం జరిగిన 12 గంటల్లోనే కట్నం కోసం వేధిస్తూ.. భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన దారుణం ఉత్తరాఖండ్​లో చోటుచేసుకుంది.

triple talaq for dowry
ట్రిపుల్ తలాక్
author img

By

Published : Dec 3, 2021, 5:02 AM IST

Updated : Dec 3, 2021, 6:46 AM IST

Triple Talaq to Wife: పెళ్లి జరిగిన 12 గంటల్లోనే భార్యకు ట్రిపుల్​ తలాక్ చెప్పిన విస్తుపోయే ఘటన ఉత్తరాఖండ్​లో జరిగింది. కట్నం కింద ఇస్తానని చెప్పిన ఏసీ, కారు, బుల్లెట్ ఇవ్వకపోవడం వల్ల ఈ దారుణానికి పాల్పడ్డాడు రుద్రపుర్​లోని ఓ వ్యక్తి.

ఏం జరిగిందంటే?

కిచ్ఛా దరవూకు చెందిన నిమ్రా ఖాన్​కు నవంబర్​ 28న బిలాస్​పుర్​కు చెందిన శావెజ్ ఖాన్​తో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన సాయంత్రం నిమ్రా అత్తారింటికి వెళ్లగా.. వారు ఆమెను కింద కూర్చోబెట్టి కట్నం గురించి ఎత్తి పొడుస్తూ అవమానించారు. అయితే తన తండ్రి ప్రస్తుతం కట్నం ఇచ్చుకునే పరిస్థితిలో లేడని ఆమె బదులివ్వగా.. ఆమెపై వారు చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది.

మరునాడు ఉదయం నిమ్రా సోదరులు ఆ ఇంటికి రాగా, వారి ముందే ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు శావెజ్. దీంతో నిమ్రాను తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు సోదరులు. అయినప్పటికీ అత్తింటివారు ఫోన్​లో వేధిస్తుండటం వల్ల భర్త సహా 8 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది నిమ్రా.

ఇదీ చూడండి: జూదంలో భార్యను ఓడి.. ట్రిపుల్​ తలాక్​తో ఇంటి నుంచి గెంటేసి..

Last Updated : Dec 3, 2021, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.