ETV Bharat / bharat

స్నేహితులతో కలిసి భార్యపై గ్యాంగ్​రేప్.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మైనర్​పై.. - బిలాస్​పుర్ పోలీసి స్టేషన్

స్నేహితులతో కలిసి సొంత భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది. మరోవైపు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి 14 ఏళ్ల మైనర్​పై రెండు నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు ఓ కామాంధుడు. ఈ దారుణం హరియాణాలో జరిగింది.

Husband gang raped his wife with friends
సామూహిక అత్యాచారం
author img

By

Published : Jul 14, 2022, 9:54 AM IST

సొంత భర్తే స్నేహితులతో కలిసి తన భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్​.. జైపుర్​లోని సంగనేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలికి నిందితుడితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అనంతరం అతడు మద్యం, డ్రగ్స్​కు బానిసయ్యాడు. నిందితుడు రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను కొట్టేవాడు. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా అతడిలో ఎటువంటి మార్పు రాలేదు. కొన్ని నెలలుగా నిందితుడు తన స్నేహితులతో కలిసి ఇంట్లోనే మందు పార్టీలు చేసుకోవడం ప్రారంభించాడు.

జూన్​ 28న నిందితుడు అతని స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకునేందుకు ఇంటికి వచ్చాడు. భార్యను మద్యం పోయమని అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడం వల్ల బాధితురాల్ని తీవ్రంగా కొట్టి తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. బాధితురాలు నిందితుల నుంచి తప్పించుకుని తన పుట్టింటికి చేరుకుని జరిగిన దారుణాన్ని చెప్పింది. నిందితుడి బెదిరింపులకు భయపడి మొదట పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కుటుంబ సభ్యులు ఆమెకు ధైర్యం చెప్పగా మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై సంగనేర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి..:
హరియాణా.. గురుగ్రామ్​లో దారుణం జరిగింది. 14 ఏళ్ల మైనర్​ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె పొరుగింటి వ్యక్తి రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు.. బాధితురాల్ని జూన్​ 8న కిడ్నాప్ చేసి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం జరిగిన విషయం ఎవరికైనా చెబితే ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. అనంతరం దిల్లీ- జైపుర్ జాతీయ రహదారిపై వదిలేశాడు.

బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమెను గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. బాధితురాలు తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయమంతా చెప్పింది. బిలాస్​పుర్ పోలీస్​ స్టేషన్​లో బాధితురాలి కుటుంబ సభ్యులు.. నిందితుడిపై బుధవారం ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మైనర్ 8వ తరగతి చదువుతోందని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ప్రియురాలిపై అనుమానంతో హత్య.. ఆపై యువకుడు ఆత్మహత్య

అక్కా అని పిలిచి అర్ధరాత్రి 'ఆమె'పై మృగాడి దాడి.. రెండు కళ్లు పొడిచేసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.