ETV Bharat / bharat

పెద్దల తీర్పు- 'ఏవండీ.. ఆవిడ వచ్చింది' రిపీట్​ - friendship on facebook

ఉత్తర్​ప్రదేశ్ రామ్​పుర్​ జిల్లాలో ఇద్దరు భార్యలున్న ఓ వ్యక్తికి అదిరిపోయే తీర్పునిచ్చారు ఆ గ్రామ పంచాయతీ పెద్దలు. తెలుగు సూపర్​ హిట్​ సినిమా 'ఏవండీ.. ఆవిడ వచ్చింది'లో లాగా భర్త.. మూడు రోజులు మొదటి భార్య వద్ద.. మరో మూడు రోజులు రెండో భార్య వద్ద ఉండాలని, ఆదివారం తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని తీర్మానించారు.

two wives
ఇద్దరు భార్యలు
author img

By

Published : Jun 19, 2021, 2:47 PM IST

ఆంధ్ర సోగ్గాడు శోభన్​బాబు నటించిన సూపర్​ హిట్​ మూవీ 'ఏవండీ.. ఆవిడ వచ్చింది'ని తలపించే ఘటన ఉత్తర్​ప్రదేశ్ రామ్​పుర్​ జిల్లా డోనక్​పురి తండాలో జరిగింది. డోనక్​పురి తండాలో చెందిన తక్మీల్ అహ్మద్​ రెండు పెళ్లిళ్ల వివాదంలో ఆ గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయే తీర్పునిచ్చారు. ఆ భర్త.. వారంలో మొదటి మూడు రోజులు( సోమ, మంగళ, బుధ) మొదటి భార్య వద్ద చివరి మూడు రోజులు( గురు,శుక్ర,శని) రెండో భార్య వద్ద ఉండేలా తీర్మానించారు. ఇక ఆదివారం తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని తక్మీల్​కు సూచించారు. ఆ సినిమాలో కూడా శోభన్​బాబు.. వారంలో మూడు రోజులు శారద, మరో మూడు రోజులు వాణిశ్రీ వద్ద ఉంటారు. ఒక రోజు తల్లిదండ్రుల వద్ద ఉంటాడు.

ఫేస్​బుక్ పరిచయం..

అప్పటికే వివాహమైన తక్మీల్ అహ్మద్.. ఉపాధి నిమిత్తం ఛండీగఢ్​లో కొన్ని నెలలపాటు ఉన్నాడు. ఈ క్రమంలో ఫేస్​బుక్​లో అసోంకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త పెళ్లికి దారితీసింది. ఇద్దరూ ఛండీగఢ్​లో 8నెలలపాటు గడిపారు. ఆమె గర్భవతి అని తేలిన వెంటనే ఆ మహిళను అసోం పంపించాడు తక్మీల్.

ఆ తర్వాత ఫోన్​ నంబర్​ మార్చాడు తక్మీల్. ఇటీవల తన ఆరు నెలల శిశువుతో ఆ యువతి ఛండీగఢ్​కు వచ్చింది. తక్మీల్ చిరునామా.. తెలుసుకుని ఇంటికి వచ్చింది. దీంతో ఈ విషయం మొదటి భార్యతో పాటు బంధువులు, గ్రామస్థులకు తెలిసింది. ఈ క్రమంలో గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి.. పై విధంగా తీర్మానించారు.

ఇదీ చదవండి : ప్రేమ రిజెక్ట్​ చేసిందని.. 22 సార్లు అతి దారుణంగా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.