కర్ణాటక, రామ్‌నగర జిల్లా కనకపురా పట్టణంలో విషాదకర ఘటన జరిగింది. కరోనాతో భర్త చనిపోగా.. మూడు నెలల గర్భంతో ఉన్న ఆయన భార్య బలవన్మరణానికి పాల్పడింది.
నందిని (28) కనకపుర పట్టణంలో బెంగళూరు ఎలక్ట్రిసిటీ కంపెనీ డివిజినల్ కార్యాలయంలో అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. మైసూర్‌కు చెందిన సతీష్ అనే వ్యాపారవేత్తను రెండేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి.
భర్త, అత్త మరణంతో..
గతవారం సతీష్ తల్లి కరోనాతో మరణించింది. ఆ తర్వాత వైరస్ బారిన పడి ఆస్పత్రి పాలైన సతీష్.. మూడు రోజుల క్రితం మృతి చెందాడు. భర్త మరణంతో నందిని మానసికంగా కుంగిపోయింది. తల్లి పర్యవేక్షణలో ఉన్న ఆమె.. పని ఉందని గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: 'దేశంలో తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు'