Husband absconding with wife: చనిపోయిందని నిర్ధరించిన తన భార్య మృతదేహాన్ని ఓ వ్యక్తి ఆగమేఘాల మీద బయటకు తీసుకెళ్లిపోయాడు. ఆస్పత్రిలో స్ట్రెచర్, అంబులెన్స్, వీల్‌ఛైర్ అందుబాటులో ఉన్నప్పటికీ.. భుజాల మీదే శవాన్ని మోసుకెళ్లాడు. బిహార్ వైశాలి జిల్లాలోని హాజీపుర్ సదర్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.
Bihar hospital Husband absconding with wife:
మృతి చెందిన మహిళ ఇంట్లోనే ఉరి వేసుకుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చిన తర్వాత మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, ఇది అనుమానాస్పద మృతి అని వైద్యులు భావించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వాలని అనుకున్నారు. ఈ విషయాన్ని మృతురాలి భర్తకు తెలియజేశారు. పోలీసులు వచ్చే వరకు వేచి చూడాలని చెప్పారు. అయితే, ఎవరికీ తెలియకుండా తన భార్య శవాన్ని తీసుకొని పారిపోయాడు ఆ వ్యక్తి. పోలీసు చర్యలను తప్పించుకునేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది.
శవాన్ని భుజంపై మోసుకెళ్తున్న ఆ వ్యక్తిని చూసి ఆస్పత్రి వద్ద ఉన్న వారు వీడియోలు తీశారు. అయితే, అలా వెళ్తున్న వ్యక్తిని ఎవరూ అడ్డుకోకపోవడం విచిత్రం. ఆస్పత్రి వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా.. ఎవరూ అతడిని ఆపలేదు.
ఆస్పత్రి యంత్రాంగాన్ని ఈటీవీ భారత్ సంప్రదించగా.. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి సివిల్ సర్జన్ అఖిలేశ్ కుమార్ మోహన్ వెల్లడించారు. సెక్యూరిటీ గార్డులను ప్రశ్నిస్తామని తెలిపారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: