How to Prepare Mutton Curry in Cooker: మంసాహార ప్రియులు ఆదివారం వచ్చిదంటే చాలు అదొక పండగ రోజులా భావిస్తుంటారు. మార్కెట్లో మాంసం చికెన్, మటన్ ధరలు ఎలా ఉన్నా.. వీకెండ్లో టేస్ట్ చేయాల్సిందే. సండే రోజున 'ముక్క లేనిదే ముద్ద దిగదు' అనే సామెతను అనుసరిస్తుంటారు. అయితే.. చాలా మంది మాంసాహారులు అతి ఇష్టంగా తినే వాటిల్లో.. మటన్ (మేక కూర) కర్రీ ముందు వరసలో ఉంటుంది. అయితే.. ఈ మటన్ పలు ప్రాంతాల్లో.. పలు రకాలుగా వండుతారు. ఇక్కడ మనం కుక్కర్‌లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇందుకోసం కావలసిన పదార్థాలు ఏంటి..? కుకింగ్ ప్రాసెస్ ఏంటీ? అనే విషయాలను తెలుసుకుందాం.
మటన్‌ను కుక్కర్‌లో ఉడికించేందుకు కావలసిన పదార్థాలు..
Ingredients for cooking Mutton in cooker:
- కేజీ మటన్
- 2 టేబుల్ స్పూన్ల నూనె
- 1/2 టీ స్పూన్ పసుపు
- 2 టీ స్పూన్ల అల్లం-వెల్లుల్లి పేస్ట్
- 2 టీస్పూన్ల గసగసాలు
- 1/2 టీస్పూన్ జీలకర్ర
- 2 టీ స్పూన్ల ధనియాలు (వేయించినవి)
- 3 టీస్పూన్ల కొబ్బరి పొడి
- గరం-మసాలా
- 3 యాలకులు
- 4-5 లవంగాలు
- 2-3 జోడించిన దాల్చిన చెక్క
- 1/2 టీస్పూన్ షాజీరా
- అల్లం, వెల్లుల్లి రెబ్బలు
- 3 టీస్పూన్ల కారం
- 2 టీస్పూన్ల ఉప్పు
- మసాలా పేస్ట్
- 1 కప్పు నీళ్లు
- చివరగా కొత్తిమీర తరుగు
మటన్ తయారీ విధానం..
How to Make Mutton Curry : మటన్ కర్రీ విషయంలో చాలా మంది ప్రెషర్ కుక్కర్‌లోనే మటన్‌ను ఉడకబెడుతుంటారు. ఇలా చేయడం ద్వారా వేగంగా ఉడుకుతుంది. మటన్ కర్రీ తయారీ ప్రారంభించే ముందు.. మాంసాన్ని శుభ్రంగా కడిగాలి. ఆ తర్వాతే వంటకు సిద్ధమవ్వాలి.
Mutton Curry in Cooker : ముందుగా.. కుక్కర్ ను స్టౌ మీద పెట్టి, 2 టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు వేసి, బ్రౌన్ కలర్లోకి మారే వరకు వేగనివ్వాలి. అనంతరం 1/2 టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ల అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను వేసి మిక్స్ చేయాలి. ఒక నిమిషం పాటు వేగనిచ్చి.. అందులో శుభ్రం చేసిపెట్టుకున్న మటన్ ముక్కలు వేసి, నూనెలో కాసేపు ఉడికించాలి. అనంతరం మూతపెట్టి, మటన్ ముక్కల్లోని వాటర్ కంటెంట్ పూర్తిగా ఆవిరయ్యేంత వరకు ఉడకనివ్వండి.
ఈ లోపు మసాలా దినుసులు మిక్సీ పట్టుకోండి. మిక్సీ జార్‌లోకి 2 టీస్పూన్ల గసగసాలు, 1/2 టీస్పూన్ జీలకర్ర, 2 టీస్పూన్లు ధనియాలు (వేయించినవి), 3 టీస్పూన్ల కొబ్బరి పొడి, గరం-మసాలా, 3 యాలకులు, 4-5 లవంగాలు, దాల్చిన చెక్క, 1/2 టీస్పూన్ షాజీరాతోపాటు అల్లం- వెల్లుల్లి రెబ్బలు, కాసిన్ని నీళ్లు యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టండి.
ఆ తర్వాత కుక్కరు మూత తీసి.. ఉడికించిన మటన్‌లో 3 టీస్పూన్ల కారం, 2 టీస్పూన్ల ఉప్పు వేసి కలపాలి. కాసేపటి తర్వాత.. మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలిపి, మరి కాసేపు ఉడకనివ్వండి. కాసేపు తర్వాత 1 కప్పు నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టేయండి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేయండి. కుక్కర్ చల్లారే వరకూ వేచి చూసి.. ఆ తర్వాత మూత ఓపెన్ చేయండి. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసేయండి.
అంతే.. ఘుమఘుమలాడే మటన్ కర్రీ సిద్ధమైపోతుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం..? వెంటనే మటన్ తెచ్చేయండి. అద్దిరిపోయేలా వండుకొని.. ప్లేట్లు సైతం నాకేయండి. ఈ ఆదివారం రోజున ఇలా పండగ చేసుకోండి.