ETV Bharat / bharat

How To Get Lost Things In Train : రైలు ప్రయాణంలో మీ లగేజీ పోగొట్టుకున్నారా?.. అయితే మీ వస్తువులను తిరిగి పొందండిలా!

How To Get Our Lost Things In Train : ఎక్కడికైనా దూర ప్రాంతాలకు ప్రయాణమయ్యేటప్పుడు మనం ఎక్కువగా ఎంచుకునే మార్గం రైలు ప్రయాణం. ప్రయాణ సందడిలో ఉండి కొన్ని సార్లు మన వస్తువులను మరిచిపోతుంటాం. వాటిలో బంగారం లాంటి విలువైనవీ ఉండవచ్చు. ఏవైనా విలువైన పత్రాలు కూడా ఉండొచ్చు. చాలా మంది అవి మరి ఇక తిరిగి రావు అని ఊరుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో ప్రయాణీకులు పోగొట్టుకున్న వస్తువులను రైల్వే శాఖ తిరిగి వారికి అప్పగించారనే సంగతి మీకు తెలుసా. అయితే దీనికోసం మనం ఏమేం చేయాలో తెలుసుకుందాం.

How To Get Lost Things In Train
How To Get Lost Things In Train
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 7:14 AM IST

How To Get Our Lost Things In Train : రైల్లో మనం ప్రయాణం చేసేటప్పుడు మనం పోగొట్టుకున్న సామగ్రి, వస్తువులను తిరిగి పొందవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. చాలా సులభమైన పద్ధతిలో మన వస్తువులను తిరిగి పొందవచ్చు. అయితే ట్రైన్​లో మరిచిపోయిన వస్తువులను రైల్వే అధికారులు చాలా సందర్భాల్లో తిరిగి ప్రయాణీకుల చెంతకు చేర్చారంటే మీకు ఆశ్చర్యం కలుగవచ్చు. మీరు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందేందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

రైల్వే పోలీసులుకు సమాచారం..
రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు సమయంలో మరిచిపోవడం కానీ పోగొట్టుకున్నట్లయితే ఆందోళన చెందవద్దు. ముందుగా ఈ విషయాన్ని రైల్వే అధికారులను సంప్రదించి వారికి తగు వివరాలను సమర్పించండి. ముఖ్యంగా రైల్వే పోలీసులకు(ఆర్పీఎఫ్) ఈ సమాచారాన్ని వీలైనంత త్వరగా తెలియజేయండి. వారు ఒక వేళ మీకు సంబంధించిన లగేజీ ఆచూకీ కనిపెట్టలేకపోతే మీకు ఇంకో మార్గం కూడా ఉంది. అప్పుడు మీరు ఆర్ఫీఎఫ్ స్టేషన్​లో ఫిర్యాదు చేయండి.

మీ వస్తువులను ఎవరైనా దొంగిలిస్తే..ఇలా చేయండి
మీరు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వస్తువులను ఎవరైనా దొంగిలించినట్లయితే చింతించవద్దు. వెంటనే మీరు ఆ కోచ్​లో ఉన్న టికెట్ కలెక్టర్​కు మీ సమస్యను వివరించవచ్చు. కోచ్​ అటెండెంట్, గార్డ్​లకు తెలియజేయడం ద్వారా మీ సమస్యకు పరిష్కారం లభించవచ్చు. వారు మీకు ఒక ఎఫ్ఐఆర్(ప్రాథమిక సమాచార నివేదిక) ఫామ్ ఇస్తారు. మీరు వాస్తవాలతో కూడిన వివరాలను వారికి అందించాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన ఫిర్యాదును తదుపరి చర్యల కోసం వారు స్థానిక పోలీస్​ స్టేషన్​కు పంపిస్తారు. దీంతో సులభంగా మీ ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించకుండానే సమస్యకు పరిష్కారం పొందవచ్చు.

రికవరీ చేసిన వస్తువులను పోలీస్​వారు అందించే మార్గమిదిగో..
మీరు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి రికవరీ చేసిన, మీ వస్తువులను మీరు ఎక్కడైతే ఫిర్యాదు చేశారో ఆ స్టేషన్ పరిధిలోకి తీసుకువస్తారు. మీరు ఎఫ్​ఐఆర్​లో ఇచ్చిన వివరాలు ఆధారంగా మీకు సమాచారం అందజేస్తారు. అక్కడకు వెళ్లి మీరు సంబంధించిన పత్రాలు, ఆధారాలు చూపిస్తే మీకు తిరిగి మీ వస్తువులను ఇచ్చేస్తారు. అది ఒక వేళ మరి విలువైన వస్తువయినట్లయితే దానిని జోనల్​ ఆఫీస్​కు పంపేముందు ఒక రోజు పాటు స్టేషన్​లోనే ఉంచుతారు.

DA Hike For Railway Employees : రైల్వే ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. 4 శాతం DA పెంచిన కేంద్రం

Train Ticket Transfer Process : రైలు ప్రయాణం వాయిదా పడిందా?.. ట్రైన్​ టికెట్​ను ఈజీగా ట్రాన్స్​ఫర్ చేసుకోండిలా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.