ETV Bharat / bharat

How to get Discounts on Train Tickets : రైలు టికెట్లు డిస్కౌంట్లో కావాలా నాయనా..? ఇలా చేయండి​! - రైలు టికెట్లు డిస్కౌంట్​ పొందడానికి బెస్ట్ టిప్స్

How to get Discounts on Train Tickets : ట్రైన్లో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా..? ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలని చూస్తున్నారా? అయితే.. ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మేము చెప్పినట్టు చేస్తే.. ట్రైన్ టికెట్లపై డిస్కౌంట్స్ పొందవచ్చు!

How to get Discounts on Train Tickets
How to get Discounts on Train Tickets
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 5:10 PM IST

Best Tips for Discounts on Train Tickets : దూర ప్రాంతాలకు ప్రయాణించేవారు రైలు మార్గాన్నే ఎక్కువగా ఎంచుకుంటారు. అయితే.. ఇటీవల ఇండియన్ రైల్వే(Indian Railways) శాఖ టికెట్ ధరల విషయంలో కొన్ని మార్పులు చేసింది. వీటి ప్రకారం.. రైలు టికెట్ల బుకింగ్​పై డిస్కౌంట్ పొందవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా రైల్వే శాఖ అందిస్తోన్న ఈ టిప్స్ పాటించడమే. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ట్రైన్ టికెట్ల కోసం ఆఖరి నిమిషంలో హడావిడి పడేవారు ఎంతో మంది ఉంటారు. చివరకు అధిక ధర చెల్లించి తత్కాల్ లో కుడా టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే.. ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకునే వారికి రైల్వే శాఖ డిస్కౌంట్స్ ఇస్తోంది. జర్నీకి కనీసం120 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా.. సులువుగా ఒకే కోచ్​లో అందరికీ బెర్త్ కన్ఫామ్ కావడంతోపాటు.. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా టికెట్ పొందొచ్చు.

Best 5 Train Ticket Booking Apps : ఆన్​లైన్​లో ట్రైన్ టికెట్స్.. బెస్ట్ యాప్స్ ఇవే!

క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ : మీరు ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు ఎల్లప్పుడూ క్యాష్‌బ్యాక్ సైట్‌లను గమనించటం ముఖ్యం. ఈ సేవను వినియోగించుకోవడం ద్వారా.. క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో కొంతమేర డబ్బు ఆదా చేసుకోవచ్చు. ట్రైన్ టికెట్ బుకింగ్‌పై చాలా సైట్లు ధర తగ్గింపుతోపాటు క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తాయి. ఈ క్రమంలోనే ఇటీవల IRCTC SBIతో జాయింట్ టికెట్ బుకింగ్ కోసం ప్లాటినం కార్డ్‌ను కూడా ప్రారంభించింది. టికెట్ల బుకింగ్ కోసం వీటి ద్వారా చెల్లింపులు చేయటం ద్వారా మీరు ఆఫర్లు పొందవచ్చు.

సీనియర్ సిటిజన్స్ : ఇక, మీతోపాటు ప్రయాణించేవారిలో సీనియర్ సిటిజన్స్ ఉంటే.. వారికి ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. సీనియర్ సిటిజన్ కోటా కింద టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, 58 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు సీనియర్ సిటిజన్ కోటాను వినియోగించుకోవచ్చు. ఇండియన్ రైల్వే నిబంధనల ప్రకారం.. పురుషులకు 40శాతం, మహిళలకు 50 శాతం రాయితీ అందుతుంది.

పేటీఎం, ఐఆర్​సీటీసీ ఆఫర్లు : అలాగే.. మీరు రైలు టికెట్లు బుక్ చేసేటప్పుడు పేటీఎం(Paytm), ఐఆర్​సీటీసీని ఓసారి గమనించండి. ఎందుకంటే పేటీఎం, ఐఆర్​సీటీసీ(IRCTC) తరచూ ట్రైన్ టికెట్లపై ఆఫర్లు ప్రకటిస్తాయి. వీటిని ఫాలో అవ్వడం ద్వారా.. మీరు రైలు టికెట్లపై భారీ డిస్కౌంట్లు పొందే అవకాశం కూడా ఉంటుంది. దీంతో.. మీరు కొంతమేర డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా.. పైన పేర్కొన్న చిట్కాలు పాటిస్తే.. మీ ట్రైన్ టికెట్లపై సాధ్యమైనంత మేర డబ్బు ఆదా చేసుకోవచ్చు.

How to Cancel IRCTC Train Tickets Online : ఐఆర్​సీటీసీలో.. ట్రైన్ టికెట్స్ రద్దు చేసుకోవడం ఎలా..?

Railway General Ticket Rules : ఒక ట్రైన్​ జనరల్​ టికెట్​తో మరో రైలులో ప్రయాణించొచ్చా? రూల్స్​ ఏం చెబుతున్నాయి?

IRCTCలో రైలు టికెట్స్​ బుక్​ అవ్వట్లేదా.. అమెజాన్, పేటీఎంల్లో ట్రై చేయండి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.