ETV Bharat / bharat

How to Check Status of TS e-Challans Online : మీరు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారా.. ఇప్పుడే మీ ఇ-చలాన్ స్టేటస్ చెక్ చేసుకోండిలా.! - పేటీఎం ద్వారా ఇ చలాన్లు చెల్లించండిలా

TS e-Challans Pay Online Procedure : మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్నారా? ఒకవేళ ట్రాఫిక్ పోలీసుల కన్ను గప్పి మీరు తప్పించుకున్నా.. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు మిమ్మల్ని పసిగడుతాయన్న విషయం మరవద్దు. అయితే మీరు ఇలా చేసి ఉంటే మీకు తెలియకుండానే వాహనాలపై ఇ-చలాన్లు నమోదు అయి ఉంటాయి. అయితే ఆలస్యమెందుకు ఇప్పుడే ఆన్​లైన్​లో సింపుల్​గా చెసుకోండిలా..

Check Status of TS e-Challans
TS e-Challans
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 3:53 PM IST

How to Check Status of TS e-Challans Online : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా... ట్రాఫిక్ రూల్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటేనే.. సిగ్నల్ జంపింగ్ దొంగలు దొరికేవారు. కానీ.. ఇప్పుడు మూడో కన్ను(CC Cameras) వారిపై నిఘా వేస్తోంది. సీసీ కెమెరాల ద్వారా.. తప్పుడు దారిలో వెళ్తున్న వారికి కళ్లెం వేసే చర్యలు చేపట్టారు. దీని ప్రకారం.. ఎవరు సిగ్నల్ ను ఉల్లంఘించినా.. ఫైన్ తప్పదు. ఆ విషయం మనకు ఇంటికి లెటర్ వచ్చేదాకా తెలియదు. మరి, మీ వాహనంపై ఇప్పటిదాకా ఎన్ని చలాన్లు ఉన్నాయో ముందే తెలుసుకుంటే ఏం చేయాలో తెలుసా..?

Check Status of TS e-Challans Online : మనం నిత్యం రోడ్డుపై ఎంతో బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేస్తున్నా.. ఒక్కోసారి అత్యవసర సమయంలో "గీత" దాటేస్తాం. ఆ టైమ్​లో మనల్ని ఎవ్వరూ చూడలేదు అనుకుంటాం. కానీ.. మన వ్యవహారం రికార్డైపోయి ఉంటుంది. మరి, ఈ లెక్కన ఇప్పటి వరకూ మీ బైక్ పై ఎన్ని చలాన్లు ఉన్నాయో మీకు తెలుసా.. ఒక్కసారి ఆన్​లైన్​లో సింపుల్​గా ఇ-చలాన్ల స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ వాహనాల మీద ఏవైనా చలాన్లు(E Challans) ఉంటే.. వెంటనే చెల్లించండి. దీనికోసం.. ఈ పద్ధతిని అనుసరించండి..

పరివాహన్ పోర్టల్‌ ద్వారా..

TS e-Challan On Parivahan Portal :

  • మొదట మీరు ఇ-చలాన్ వెబ్సైట్ parivahan.gov.inని సందర్శించాలి.
  • అనంతరం లాగిన్ అయ్యాక Check Online Services పై క్లిక్ చేసి.. 'Check Challan Status' అనే ఆప్షన్పై నొక్కాలి.
  • అప్పుడు ఓపెన్ అయ్యే పేజీలో మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్/వాహనం నంబర్ను తప్పనిసరిగా నమోదు చేయాలి.
  • మీరు వాహనం నంబర్ ద్వారా తెలుసుకోవాలంటే మీ వెహికిల్ ఛాసిస్ లేదా ఇంజిన్ నంబర్నూ టైప్ చేయాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత మీ వాహనంపై జరిమానా లేకపోతే చలాన్ కనుగొనబడలేదని వస్తుంది.
  • ఒకవేళ మీ వెహికిల్​పై ఇ-చలాన్ జారీ చేసి ఉంటే చలాన్ గురించి అన్ని వివరాలను మీకు చూపుతూ ఒక పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఈ విధంగా సింపుల్​గా మీరు ఆన్​లైన్​లో ఇ-చలాన్ స్టేటస్ చెక్​ చేసుకోవచ్చు
  • ఇక వాహనంపై స్టేటస్ చెక్ చేసుకున్నాక చాలా మంది వాటిని ఎక్కడ చెల్లించాలనే సందేహంలో ఉంటారు. ఇప్పుడు గతంలో మాదిరిగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు వెళ్లి చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోటు నుంచే మీ మొబైల్లో చాలా సులభంగా మీ వెహికిల్పై ఉన్న ఇ-చలాన్లు చెల్లించవచ్చు. వాటికోసం ఇక్కడ కొన్ని పద్ధతులు మీకు తెలియజేస్తున్నాం..

అమల్లోకి వచ్చిన ట్రాఫిక్​ కొత్త రూల్స్​.. గీతదాటారో ఇక అంతే..

How to Pay TS e-Challans Amount use Parivahan Portal :

పరివాహన్ పోర్టల్ ఉపయోగించి TS ఇ-చలాన్‌ను ఎలా చెల్లించాలో చూద్దాం..

  • మొదట మీరు ఇ-చలాన్ అధికార వైబ్సైట్ https://echallan.parivahan.gov.in/ ని సందర్శించాలి.
  • ఆ తర్వాత మీరు ఆన్లైన్లో చెల్లించే ఆప్షన్ను ఎంచుకోవాలి. అప్పుడు మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ మీరు 'చలాన్ నంబర్, వాహనం నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ నమోదు చేయాలి.
  • అనంతరం Captcha కోడ్‌ను నమోదు చేసి.. 'Get Details' అనే బటన్ను ప్రెస్ చేయండి. ఆపై వచ్చే పేజీలో మీరు ఇ-చలాన్కు సంబంధించిన పూర్తి వివరాలు పొందుతారు.
  • అప్పుడు చెల్లింపు కాలమ్ క్రింద ఉన్న 'Pay Now' అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. అనంతరం మీకు అందుబాటులో చెల్లింపు పద్ధతిని ఎంచుకోవాలి.
  • మీ వద్ద క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్/UPI ద్వారా మీ ఇ-చలాన్ పేమెంట్ చెల్లిస్తారు.
  • ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు మీరు చెల్లించినట్లు ధ్రువీకరణ సందేశం వస్తుంది.

How to Pay TS e-Challans Amount Through TS Police Portal :

టీఎస్ పోలీస్ పోర్టల్‌ని ఉపయోగించి ఇ-చలాన్‌ను ఎలా చెల్లించాలంటే..

  • మీరు మొదట TS పోలీసు అధికారిక వెబ్‌సైట్‌ https://echallan.tspolice.gov.in/ ని సందర్శించాలి.
  • అనంతరం మీ "వెహికల్ నంబర్" నమోదు చేయాలి. అలాగే హోమ్ స్క్రీన్‌పై వచ్చే భద్రతా ప్రశ్నకు సమాధానం ఇచ్చి "GO" బటన్పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీరు ఇ-చలాన్ జాబితాను పొందుతారు. ఆపై మీరు చెల్లించాల్సిన దాన్ని ఎంచుకోవాలి.
  • వివరాలను ధ్రువీకరించుకున్నాక.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి ఇ-చలాన్ చెల్లింపులు చేయండి.
  • మీ చెల్లింపును పూర్తి చేసిన తర్వాత ట్రాకింగ్ ప్రయోజనాల కోసం రిఫరెన్స్ IDగా మీకు సహాయం చేయడానికి రసీదుని పొందుతారు.

How to Pay e-Challans Amount use Paytm App :

Paytm యాప్‌ని ఉపయోగించి ఇ-చలాన్ ఎలా చెల్లించాలంటే..

  • మొదట మీరు మీ మొబైల్ లేదా టాబ్లెట్‌లో Paytm యాప్‌ని ఓపెన్ చేయాలి.
  • 'రీఛార్జ్ & బిల్ చెల్లింపులు' ప్రాంతంలో 'మరిన్ని వీక్షించండి' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి. D
  • అప్పుడు 'My Bills & Recharges' అనే పేజీలో 'ట్రాన్సిట్' విభాగంలో "చలాన్" ఎంపికపై క్లిక్ చేయాలి.
  • అనంతరం "ట్రాఫిక్ చలాన్ చెల్లించండి" అనే పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ, మీరు అందించిన జాబితా నుంచి తప్పనిసరిగా "తెలంగాణ ట్రాఫిక్ పోలీస్"ని ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత మీ "వాహనం నంబర్"ని నమోదు చేసి, కొనసాగించడానికి "కొనసాగించు" అనే ఆప్షన్​పై నొక్కాలి.
  • అప్పుడు వాహనం వివరాలు, బకాయి మొత్తం, చలాన్ నంబర్ వివరాలు తదుపరి పేజీలో కనిపిస్తాయి.
  • వివరాలను ధ్రువీకరించి "ప్రొసీడ్ టు పే" అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి. అలాగే మీరు మీ ప్రాధాన్య చెల్లింపు విధానాన్ని తప్పనిసరిగా ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో చెల్లింపు సారాంశం కనిపిస్తుంది. లావాదేవీని నిర్ధారించడానికి మీరు 'Pay Now' ” బటన్‌ను క్లిక్ చేసి ఆ చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
  • Operation rope giving good results: సక్సెస్​ రూట్లో ఆపరేషన్​ రోప్​.. అంతా దారికొస్తున్నారు..
  • హైదరాబాద్​లో ట్రాఫిక్ కొత్త రూల్స్.. గీతదాటితే రూ.100, అడ్డుపడితే రూ.1000 కట్టాల్సిందే..
  • Cyberabad Traffic Police : 'మేం రూల్స్ పెడతాం.. కానీ ఫాలో అవ్వం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.