ETV Bharat / bharat

చనిపోయిన వ్యక్తిలో కరోనా ఎంతసేపు ఉంటుంది?

చనిపోయిన వ్యక్తిలో కరోనా ఎంతసేపు సజీవంగా ఉంటుంది? ప్రస్తుతం చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునేందుకు ఎయిమ్స్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ ఫోరెన్సిక్ మెడిసిన్ గతఏడాది కాలంగా అధ్యయనం చేసింది. అధ్యయన ఫలితాలను వెల్లడించిన ఎయిమ్స్‌ ఫొరెన్సిక్‌ చీఫ్‌ డాక్టర్‌ సుధీర్‌ గుప్త ఆసక్తికర విషయాలను తెలిపారు.

dead body
మృతదేహంపై కరోనా ఎంతసేపు ఉంటుందంటే..
author img

By

Published : May 25, 2021, 8:56 PM IST

కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను ప్రభావితం చేస్తోంది. అందరూ ఉన్న ఎవరూ దగ్గరకు రాలేని పరిస్థితి నెలకొంది. సొంత కుటుంబ సభ్యుడే చనిపోయినా కరోనా భయంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఐతే.. చనిపోయిన వారికి గౌరవం ఇచ్చే ఉద్దేశంతో ఎయిమ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్.. ఏడాది కాలంగా అధ్యయనం చేపట్టింది. కొవిడ్‌తో చనిపోయిన వ్యక్తి ముక్కు, శరీరంలో 12నుంచి 24 గంటల తర్వాత కరోనా వైరస్‌ బతకలేదని.. ఎయిమ్స్‌ ఫొరెన్సిక్‌ చీఫ్‌ డాక్టర్‌ సుధీర్‌ గుప్త తెలిపారు.

తర్వాత నెగెటివే..

దాదాపు వందకు పైగా కరోనా శవాలను పరీక్షించామన్న ఆయన.. మృతదేహాలకు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహిస్తే నెగెటివ్‌ వచ్చిందని వెల్లడించారు. మృతదేహాల నుంచి.. వైరస్‌ వ్యాప్తి జరగడానికి అవకాశం చాలా తక్కువని పేర్కొన్నారు. ముందస్తు రక్షణలో భాగంగా మృతదేహం ముక్కు రంధ్రాలు, శరీరం నుంచి ద్రవాలు స్రవించే ప్రదేశాలను.. మూసి వేయడం, రోగికి అమర్చిన వివిధ పైపులను.. శానిటైజ్‌ చేయాలని సూచించారు. కరోనా పాజిటివ్‌తో చనిపోయిన మెడికో-లీగల్‌ కేసులను పరీక్షించడం ద్వారా.. ఈ విషయాలను గుర్తించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 90 ఏళ్ల వృద్ధురాలిని భుజాలపై మోసుకెళ్లిన పోలీసు

ఇదీ చదవండి: కొవిడ్​ వేళ థైరాయిడ్​ సమస్యను అధిగమించటం ఎలా?

జాగ్రత్తలు తప్పనిసరి..

ఐతే.. అంత్యక్రియల్లో పాల్గొనే వారు ముందస్తు రక్షణగా కచ్చితంగా మాస్క్‌లు, చేతికి గ్లౌవ్స్‌, పీపీఈ కిట్లు ధరించాలన్నారు. అంత్యక్రియలు ముగిసిన అనంతరం.. చితాభస్మం సేకరించడం పూర్తిగా సురక్షితమేనని తెలిపారు.ఆ సమయంలో కరోనా వ్యాప్తికి ఆస్కారమే లేదన్నారు. మే 2020లో కొవిడ్‌-19 మృతదేహాలకు సంబంధించి పోస్ట్‌మార్టం చేయడంపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలను విడుదల చేసింది.

కరోనా మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడింది. పోస్ట్‌మార్టం చేయడం ద్వారా..మార్చురీ ఉద్యోగులు, వైద్యులు, పోలీసుల జీవితాలను.. ప్రమాదంలోకి నెట్టినట్లు అవుతుందని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్‌మార్టం చేయాల్సి వస్తే.. సరైన రక్షణతో వీలైనంత తక్కువ పనితో ఆ తంతు ముగించాలని తెలిపింది.

ఇవీ చదవండి: 'రంగు గురించి భయపడొద్దు.. కారణం తెలుసుకోండి'

'కరోనా కారణంతో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.