ETV Bharat / bharat

Amaravati Farmers Protest: భగ్గుమన్న అమరావతి రైతులు.. నల్ల బెలూన్లతో నిరసన - ap news

Amaravati Farmers Protest: పేదలకు చెల్లని పట్టాలు పంపిణీ చేసిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని.. అమరావతి రైతులు ఆక్రోశించారు. అమరావతిని నాశనం చేస్తున్న జగన్‌ గో బ్యాక్ అంటూ.. నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. చెల్లని పట్టాలిచ్చిన సీఎం.. సుప్రీంకోర్టు తుది తీర్పు తర్వాత పేదలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

Amaravati Farmers Protest
అమరావతి రైతుల నిరసనలు
author img

By

Published : May 26, 2023, 10:25 PM IST

భగ్గుమన్న రైతులు.. సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు

Amaravati Farmers Protest: అమరావతి R-5 జోన్‌లో ఇళ్లపట్టాల పంపిణీపై రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు భగ్గుమన్నారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉదయం నుంచి శాంతియుత నిరసన తెలిపిన రైతులు సీఎం ప్రసంగం ముగిశాక ఒక్కసారిగా రోడ్డెక్కారు. తుళ్లూరు సెంటర్ వైపు ర్యాలీగా బయలుదేరిన రైతులు.. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే.. బైఠాయించారు.

ఆ సమయంలో మేడికొండూరు నుంచి వచ్చిన ఓ వైసీపీ కార్యకర్త జై జగన్ అంటూ.. నినాదాలు చేశారు. రైతులు ఆగ్రహంతో వైసీపీ కార్యకర్తల వైపు దూసుకెళ్లారు. పోలీసులు చాకచక్యంగా.. వైసీపీ కార్యకర్తను వేరే వాహనం ఎక్కించి పంపించివేశారు. అదే సమయంలో.. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వాహనం అటుగా రాగా.. రైతులు జై అమరావతి సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఎమ్మెల్యే వాహనం సజావుగా వెళ్లేలా చూశారు.

People Left from CM Meeting: సీఎం జగన్ బహిరంగ సభ.. కుర్చీలు లేక జనాల అవస్థలు

R5 Zone Issue: సీఎం సభకు రాక ముందు నుంచే రాజధాని గ్రామాలు నిరసనలతో.. హోరెత్తాయి. సీఎం గో బ్యాక్‌ నినాదాలతో దద్దరిల్లాయి. మందడం శిబిరం నుంచి రైతులు రోడ్డెక్కేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అమరావతికి ఉరేసిన జగన్‌ తమకూ కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని మెడకు తాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు.

తుళ్లూరులో ఇళ్లపైన.. సభకు వెళ్లే మార్గంలో దుకాణాల ముందు కూడా నల్ల బెలూన్లు కట్టి నిరసన తెలిపారు. రైతులు చేతికి నల్ల రిబ్బన్లు కట్టుకుని, గాల్లోకి నల్లబెలూన్లు ఎగరేశారు. చెల్లని పట్టాలు తీసుకుని మోసపోవద్దంటూ కృష్ణాయపాలెం రైతులు సూచించారు. సీఎం సభకు బస్సులు వెళ్తున్నంతసేపు నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఉద్దండరాయునిపాలెంలో రైతులు.. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి ర్యాలీ నిర్వహించారు. శిలాఫలకం వద్ద నల్లబెలూన్లతో నిరసన తెలిపారు.

"మేము డౌన్ డౌన్ సీఎం అంటుంటే.. అతను వచ్చి జై జగన్ అంటున్నాడు. అసలు అతను ఎవరు. ఎందుకు వచ్చాడు. దేనికి ఇక్కడకు వచ్చాడు. రాజధాని ప్రాంతంలోకి అతడిని ఎవరు పంపించారు. అతనిని పంపించి.. మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు". - అమరావతి మహిళా రైతు

"ఇదంతా ఎన్నికల కోసం. అసలు వీళ్లు ఇక్కడ ఇళ్లు కట్టించి ఇవ్వరు. ఈ ప్రభుత్వాన్ని నమ్మొద్దు. మమ్మల్ని రోడ్డున పడేసినట్టే.. మిమ్మల్ని కూడా చేస్తారు". - అమరావతి మహిళా రైతు

"నువ్వు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వలన 230 మంది రైతులు మరణించారు. ఇప్పుడు మొత్తం 29 గ్రామాలు సర్వనాశనం అయిపోతాయి. నిన్ను మేము తట్టుకోలేకపోతున్నాం అయ్యా.. మాకు కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రిని, గవర్నర్​ని కోరుతున్నాం". - అమరావతి మహిళా రైతు

"ఈ పేదలు వచ్చి ఇక్కడ ఏం పనిచేసుకుని బతుకుతారు. ఏమైనా కంపెనీలు కట్టినారా.. దానిలో పనిచేయడానికి. నేను ఇక్కడ ఎలాగూ గెలవను అని.. 50 వేల మందిని తీసుకొచ్చి ఓట్ల కోసం సెంటు భూములను పంచుతున్నారు. ప్రజలను మోసం చేస్తున్నారు". - అమరావతి మహిళా రైతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.