Horoscope Today: ఈరోజు (15-12-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం హేమంత రుతువు; మార్గశిర మాసం;
శుక్లపక్షం ద్వాదశి: రా. 2.42 తదుపరి త్రయోదశి
అశ్విని: ఉ. 6.42 తదుపరి భరణి
వర్జ్యం: సా. 5.05 నుంచి 6.49 వరకు
అమృత ఘడియలు: తె. 3.28 నుంచి 5.12 వరకు
దుర్ముహూర్తం: ఉ. 11.33 నుంచి 12.16 వరకు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు సూర్యోదయం: ఉ.6.26, సూర్యాస్తమయం: సా.5-24
మేషం
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలను సాగదీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.
వృషభం
మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కీలక వ్యవహారాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. విష్ణు నామస్మరణ ఉత్తమం.
మిథునం
మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
కర్కాటకం
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సంకటహార గణపతి స్తోత్రం చదవడం మంచిది.
సింహం
మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
కన్య
వృత్తి,ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం ఉత్తమం.
తుల
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లలితాదేవి నామస్మరణ మంచిది.
వృశ్చికం
మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. ముఖ్య విషయాల్లో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని మరువరాదు. పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రసన్నాంజనేయ స్వామి దర్శనం శుభప్రదం.
ధనుస్సు
ప్రారంభించే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. శనిధ్యానం చేయండి.
మకరం
శుభకాలం నడుస్తోంది. అభివృద్ధి సాధన దిశగా ఆలోచనలు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి మధురక్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన మంచిది.
కుంభం
శారీరక శ్రమ పెరుగుతుంది. మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. గతంలో ఆగిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు తీసుకోండి.
మీనం
మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శ్రీరామనామం శుభాన్ని కలిగిస్తుంది.
ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (డిసెంబర్ 12 - డిసెంబర్ 18)