Horoscope Today: ఈ రోజు(అక్టోబర్ 6) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.
ప్రారంభించిన కార్యక్రమాల్లో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టనివారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.
ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. ఆరోగ్య నియమాలను పాటించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభకరం.
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శివారాధన చేయాలి.
మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. ఈశ్వర దర్శనం మంచిది.
ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు అధికం అవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కనకధారాస్తవం చదవాలి..
దైవబలం కలదు. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒక వ్యవహారంలో నైతిక విజయం సాధిస్తారు. ఆర్ధికంగా మేలైన ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన మరింత శుభాన్ని ఇస్తుంది.
ప్రారంభించిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులతో వాగ్వాదాలకు పోవద్దు. భయాందోళనలను విడనాడాలి. చెడ్డవాళ్లతో సావాసం చేయడం వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. దుర్గాస్తుతి చదవాలి.
బుద్ధిబలంతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కలహాలకు తావివ్వరాదు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.
ఉత్సాహంగా పనిచేసి చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. అనవసర ప్రయాణాల వల్ల సమయం వృథా అవుతుంది. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. కలహాలకు తావివ్వరాదు. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది.
ప్రయత్నకార్యసిద్ధి కలదు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మాటపట్టింపులకు పోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లక్ష్మీదేవి ఆరాధన శ్రేయోదాయకం.