Horoscope Today January 8th 2024 : జనవరి 8 (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు మార్గాలవైపు మీ మనస్సు వెళ్లకుండా నియంత్రించుకోవాలి. శాంతియుత కార్యక్రమాల కోసం మాత్రమే మీ శక్తి, యుక్తులను ఉపయోగించాలి. దైవ ధ్యానం చేయడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్త!
వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారికి ఇబ్బందికర పరిస్థితిలు ఏర్పడతాయి. మిమ్మల్ని రెచ్చగొట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మీరు శాంతియుతంగా ఉండాలి. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.
మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి కొత్త బాధ్యతలు తలపై పడతాయి. కానీ పనులన్నింటినీ సకాలంలో, సక్రమంగా నెరవేర్చుతారు. కానీ టెండర్లు విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారు చాలా ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పనిపై దృష్టి సారిస్తారు. ఉద్యోగులు తమ పనుల్లో రాణిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
సింహం (Leo) : సింహ రాశివారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుండకపోవచ్చు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. జలాశయాలకు దూరంగా ఉండాలి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి చాలా బాగుంటుంది. ప్రియమైనవారితో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. స్నేహితుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.
తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు మానసిక ఆందోళనకు గురవుతారు. సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారు. కీలకమైన పనులను వాయిదా వేయడం మంచిది. మొండి వైఖరి విడనాడాలి. లేదంటే మీకే నష్టం ఏర్పడుతుంది. అయితే ఆర్థికంగా మీకు మంచి ఫలితాలే లభిస్తాయి. కానీ ఆరోగ్య సమస్యలు వేధించవచ్చు.
వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారి ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితుల నుంచి మంచి కానుకలు పొందుతారు. ప్రియమైనవారిని కలుసుకుంటారు. ప్రయాణాలు అనుకూల ఫలితాలను అందిస్తాయి. శృంగార రసానుభూతి కలుగుతుంది.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి శుభ ఫలితాలు లభిస్తాయి. కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగులు తమ పనులను చక్కగా నిర్వహిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి చాలా బాగుంటుంది. మీ మాటలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. మీ సామర్థ్యంతో పనులను సక్రమంగా పూర్తి చేస్తారు. సమస్యలను చాలా తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.
కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయి. శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. అందరూ మీ పనితీరును మెచ్చుకుంటారు. స్నేహితులు మీకు అన్ని విధాలుగా సహకారం అందిస్తారు. సమాజంలో మీ గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి.
మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో, పెద్దలతో గొడవలు పడకూడదు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. పోటీదారులపట్ల, విరోధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి.