Horoscope Today January 10th 2024 : జనవరి 10 (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి అంత అనుకూలంగా ఉండదు. పనులు సకాలంలో పూర్తి కావు. మానసిక ఆవేదనకు గురువుతారు. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యులతో, తోటి ఉద్యోగులతో మనస్పర్థలు రావచ్చు. పెంకితనంతో ప్రవర్తించకూడదు.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనులు ప్రారంభించవద్దు. మానసిక ఆందోళనకు గురువుతారు. కానీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి సారించడం మంచిది.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి చాలా బాగుంటుంది. భౌతిక సుఖాలు అనుభవిస్తారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో మీ గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఉద్యోగులకు ఇది చాలా మంచి రోజు. సహచరులు మీకు అన్ని విధాల సహకరిస్తారు. మీ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు చాలా సంతోషంగా గడుపుతారు. మీలోని కల్పనా శక్తిని కవితల రూపంలో పొందుపరుస్తారు. ప్రియమైన వారిని కలుసుకుంటారు. విద్యార్థులు బాగా రాణిస్తారు. స్నేహితుల వల్ల మంచి లబ్ధి పొందుతారు. దానధర్మాలు చేస్తారు.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారి నక్షత్ర బలం ఏమీ బాగాలేదు. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. మానసిక, శారీర ఒత్తిడిలకు గురవుతారు. కుటుంబ సభ్యులతో వివాదాలు వస్తాయి. తల్లిగారి అనారోగ్యం మిమ్మల్ని బాధిస్తుంది. దైవారాధన చేయడం మంచిది.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు ఆనందంగా గడుపుతారు. దేవుడిని దర్శించుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చక్కగా నెరవేరుస్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారికి అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనులు అన్నీ విజయవంతం అవుతాయి. ఉన్నతాధికారులు మీ పనికి ప్రశంసలు కురిపిస్తారు. అయితే న్యాయ పరమైన చిక్కుల్లో పడకుండా జాగ్రత్త పడాలి.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు మీరు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. పనులు అన్నీ చక్కగా పూర్తి చేస్తారు. ఇంట్లో ఓ శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ప్రేమించే వ్యక్తిని కలుసుకుంటారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారు ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి సారిస్తారు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకోవాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అధికంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు కొత్త పనులు ప్రారంభించడానికి చాలా మంచి రోజు. వృత్తిపరంగా మీకు మంచి లాభాలు కూడా వస్తాయి. స్నేహితుల ద్వారా మీకు మంచి అసైన్మెంట్లు లభిస్తాయి. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. పెళ్లికాని వారికి వివాహయోగం కనిపిస్తోంది. త్వరలోనే మంచి వార్త వింటారు.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. చిన్న విషయాలకే బాధపడవలసి వస్తుంది. అయితే నిరాశ, నిస్పృహలకు లోను కాకూడదు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం సాధించవచ్చు. సంకల్ప బలంతో మీరు దేన్నైనా సాధించగలరు.