Horoscope Today : ఈ రోజు (జనవరి 19) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
చేపట్టే పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. ఉత్సాహంగా పనిచేస్తే ఒత్తిడిని జయిస్తారు. ఒక సమస్యకు పరిష్కారమార్గం దొరుకుతుంది. సూర్యాష్టకం చదివితే శుభప్రదం.
ఉద్యోగంలో ఉన్నతస్థితికి చేరుతారు. వ్యాపారంలో లాభాల బాట పడతారు. ఒత్తిడిని అధికమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శివారాధన శక్తినిస్తుంది.
ఇష్టకార్య సిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. శివ ఆరాధన చేస్తే మంచిది.
ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఇష్టదైవ స్తోత్రాలు చదవడం మంచిది.
వృత్తి ఉద్యోగాల్లో మిశ్రమ వాతావరణం ఉంది. కాలాన్ని అభివృద్ధికై వినియోగించండి,మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం
చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవ్వరితోను వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీధ్యానం శుభప్రదం.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలున్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాదన మానవద్దు.
ధర్మ సిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాలను తెలివిగా చర్చించి తగు నిర్ణయాలు తీసుకొని పనులు పూర్తి చేస్తారు. చర్చలు మీకులాభిస్తాయి. ప్రసన్నాంజనేయ సోత్రం పారాయణ చేయాలి.
తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారులతో అణిగిమణిగి ప్రవర్తించవలసి ఉంటుంది. శివ స్తోత్రం పఠించడం మంచిది.
మీ మీ రంగాలలో మంచి ఫలితాలున్నాయి. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దైవారాదన మానవద్దు.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబందించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం పఠించాలి.
ముఖ్య వ్యవహార విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గ స్తోత్రం పఠించాలి.