Horoscope Today : ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 27) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. నూతన వస్తు ప్రాప్తి కలదు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.

శుభ కాలం. మీ మీ రంగాల్లో శుభప్రదం అయినటువంటి ఫలితాలను పొందుతారు. దైవ బలం కాపాడుతోంది. మంచి పనులను మొదలుపెడతారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురుధ్యానం మంచిది.

తలపెట్టిన కార్యాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహ పరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. లక్ష్మీ ఆరాధనా మరియు కనకధారాస్తవం పఠించాలి.

లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. పెద్దలయందు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్ర లాభం పొందుతారు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

శుభ కాలం. తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

సకాలంలో పనులను పూర్తిచేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులుంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.

శుభకాలం. కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో శుభఫలాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తిచేస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తే మంచిది.

ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

మీ మీ రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనఃశాంతి లోపించకుండా జాగ్రత్తపడండి. వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదలు పెట్టిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గా ధ్యానం శుభప్రదం

ప్రయత్నకార్య సిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థలాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, సమర్థవంతంగా వాటిని ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. వేంకటేశ్వర స్వామి ధ్యానం శుభప్రదం.