Horoscope Today December 24th 2023 : డిసెంబర్ 24న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు పెరుగుతాయి. కోపాన్ని తగ్గించుకోవాలి. లేకుంటే మానసిక శాంతి కోల్పోతారు. దైవ ప్రార్థన చేయడం మంచిది.
వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారి తారాబలం చాలా బాగుంది. అదృష్టం కలిసి వస్తుంది. చేపట్టిన పనులు అన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. ఈ రోజంతా మీరు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.
మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయానుకూలంగా నడుచుకోవాలి. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకూడదు. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. శాంతం వహించండి. ఆరోగ్యం పాడయ్యే సూచనలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి.
కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారి తారాబలం చాలా బాగుంది. వ్యాపార, వ్యవహారాల్లో మంచి లాభాలు గడిస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. పెళ్లికాని వారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.
సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు తమ ఆత్మవిశ్వాసంతో అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాల్లో మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి చాలా బాగుంటుంది. దాన, ధర్మాలు చేస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు.
తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మాటలు అదుపులో ఉంచుకోవాలి. అనైతిక, చట్ట విరుద్ధమైన పనులకు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లోనూ జాగ్రత్త విహించాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు.
వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారికి చాలా బాగుంటుంది. పనులను పక్కన పెట్టి, బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు. అనుకున్న పనులు అన్నీ పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి చాలా బాగుంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం అన్నీ కలిసి వస్తాయి. ఇంట్లోనూ శాంతియుత వాతావారణం నెలకొంటుంది. మిత్రుల సహకారం మీకు లభిస్తుంది. రోజంతా చురుగ్గా ఉంటారు. ఆరోగ్యానికి ఫర్వాలేదు.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిమ్మల్ని కలచివేసే ఘటనలు జరుగుతాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారు. కార్యాలయంలో, ఇంటిలో కలహాలు చెలరేగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు చాలా భావోద్వేగాలకు గురువుతారు. నిస్సహాయంగా ఉంటారు. మానసిక ప్రశాంతత కోల్పోతారు. కానీ విద్యార్థులు మాత్రం కష్టపడి చదివితే, విజయం సాధించగలుగుతారు. పనులు సకాలంలోనే పూర్తవుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కానీ ఇవన్నీ సంకల్ప బలంతో సాధ్యమవుతాయి.
మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి చాలా బాగుంటుంది. చర్చల్లో మీరే పైచేయి సాధిస్తారు. మీలోని సృజనాత్మకతను ప్రపంచానికి తెలియజేస్తారు. అందరి ప్రశంసలు పొందుతారు. అనుకున్న పనులు అన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.