HOROSCOPE TODAY: ఈ రోజు రాశి ఫలం(27-08-2022) గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే.
శ్రమ పెరుగుతుంది. ధర్మసిద్ధి ఉంది. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. శని ధ్యానం శుభప్రదం.
కృషికి తగ్గ ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి ఉంది. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.
ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. అనవసర ప్రసంగాలతో సమయం వృథా చేయకండి. దుష్టులను దరిచేరనీయకండి. ఈశ్వర సందర్శనం మంచినిస్తుంది.
మంచి పనులు చేపడతారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జపిస్తే మంచిది.
మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం.
మొదలుపెట్టిన కార్యాలను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. తోటివారి సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. గణపతి ఆరాధన మంచిది.
ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. అయినవారితో జాగ్రత్త. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.
మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. విందువినోదాలతో కాలం ఆనందంగా గడుస్తుంది. ఇష్టదైవారాధన శుభాన్నిస్తుంది.
పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. సప్తమంలో చంద్ర బలం అనుకూలంగా ఉంది. ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.
మీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
ఇవీ చదవండి: భారీగా గుప్త విరాళాలు, ప్రాంతీయ పార్టీల్లో వైకాపాకే అధికం