Horoscope Today: ఈ రోజు(ఆగస్టు 26) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే.
మధ్యమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వ్యవహరిస్తే సరిపోతుంది. చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మీ బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. సూర్యాష్టకం చదివితే మంచిది.
మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భోజన సౌఖ్యం కలదు. ఇష్టదైవారాధన శుభప్రదం.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ఆశించిన ఫలితాలున్నాయి. ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే బాగుంటుంది.
శుభఫలితాలున్నాయి. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన మంచిది.
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. భోజన సౌఖ్యం ఉంది. ఇబ్బంది పెట్టాలని చూసేవారున్నారు జాగ్రత్త. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. ఈశ్వర ధ్యానం చేయండి.
అదృష్టఫలితాలున్నాయి. మీ రంగాల్లో మంచి జరుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది.
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూలఫలితాలున్నాయి. ఇష్టదైవ స్తుతి శుభప్రదం.
శ్రమకు తగిన ఫలితాలుంటాయి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్య పనులను త్వరగా పూర్తయ్యేవిధంగా ప్రణాళికలను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.
కీలక వ్యవహారాల్లో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.
శుభ కాలం. కొన్ని వ్యవహారాల్లో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. సకాలంలో సహాయం చేసేవారున్నారు. శివారాధన చేయడం మంచిది.
తలపెట్టిన పనులను స్థిరచిత్తంతో పూర్తి చేయాలి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాధన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు.