ETV Bharat / bharat

Horoscope Today (23-09-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - గురువారం రాశిఫలం

Horoscope Today (23-09-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం ఎలా ఉన్నాయంటే..

Horoscope Today
నేటి మీ రాశిఫలం
author img

By

Published : Sep 23, 2021, 4:31 AM IST

ఈరోజు (23-09-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

  • శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం వర్ష రుతువు; భాద్రపద మాసం; బహుళపక్షం
  • విదియ: ఉ.5.54 వరకు తదుపరి తదియ
  • రేవతి: ఉ. 6.29 వరకు తదుపరి అశ్విని
  • వర్జ్యం: తె. 4.24 నుంచి
  • అమృత ఘడియలు: ఉ. 6.07 వరకు తిరిగి రాత్రి 12.59 నుంచి 2.41 వరకు
  • దుర్ముహూర్తం: ఉ.9.53 నుంచి 10.41 వరకు తిరిగి మ. 2.42 నుంచి 3.30 వరకు
  • రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
  • సూర్యోదయం: ఉ.5-52,
  • సూర్యాస్తమయం: సా.5-55
  • ఉండ్రాళ్ళ తద్దె

మేషం

శ్రమతో కూడిన శుభ ఫలితాలు ఉన్నాయి. మీలోని పోరాట పటిమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

వృషభం

స్థిరమైన ఆలోచనలతో సత్పలితాలను సాధిస్తారు. వ్యాపారులు కాస్త ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ మంచి ఫలితాలను ఇస్తుంది.

మిథునం

మనస్సౌఖ్యం ఉంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభం అవుతాయి. కుటుంబ సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

కర్కాటకం

శుభసమయం. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

సింహం

మనోబలం సర్వదా రక్షిస్తుంది. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికీ ప్రశంసలు లభిస్తాయి. కొన్ని విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు అందుతాయి. సూర్యుడిని ఆరాధిస్తే మంచిది.

కన్య

కీలక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. శివాష్టకం చదివితే బాగుంటుంది.

తుల

కుటుంబంలో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. యుక్తితో ఎంతటి కార్యాన్నైనా అసంపూర్ణంగా వదలకుండా పూర్తిచేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శ్రీవేంకటేశ్వరస్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

వృశ్చికం

మంచి ఆలోచనలతో పనులను ప్రారంభిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు లాభాన్ని చేకూరుస్తాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం.

ధనుస్సు

మిశ్రమకాలం. అధికారుల సాయంతో ఒక పని పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మకరం

బాగా ఆలోచించి పనులను చేయాలి. మిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. విష్ణుసహస్ర నామ పారాయణ మంచి ఫలితాలను ఇస్తుంది.

కుంభం

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధుమిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి.

మీనం

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుండటం వల్ల కీలక సమయాలలో సమయోచితంగా స్పందించి అధికారుల మెప్పు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (సెప్టెంబరు 19 - 25)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.