ఈరోజు (05-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం వర్ష రుతువు; భాద్రపద మాసం
బహుళపక్షం చతుర్దశి: రా. 6.27 తదుపరి అమావాస్య
ఉత్తర: రా.1.56 తదుపరి హస్త
వర్జ్యం: ఉ. 9.22 నుంచి 10.57 వరకు
అమృత ఘడియలు: సా.6.49 నుంచి 8.24 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.16 నుంచి 9.03 వరకు తిరిగి రా. 10.36 నుంచి 11.25 వరకు
రాహుకాలం: సా.3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.5-54, సూర్యాస్తమయం: సా.5-45 మాస శివరాత్రి
మేషం
మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.
వృషభం
కీలక వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. లలితాదేవి నామాన్ని స్మరించాలి.
మిథునం
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడిని ఆరాధిస్తే మంచిది.
కర్కాటకం
గొప్ప శుభాలు ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు.
సింహం
ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.
కన్య
మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శత్రువులు మీ మీద విజయం సాధించలేరు. దుర్గాస్తుతి పఠించాలి.
తుల
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంకటహర గణపతి స్తోత్రం పఠించడం శుభప్రదం.
వృశ్చికం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. గణనాయకాష్టకం పఠిస్తే మంచిది.
ధనుస్సు
అవసరానికి తగిన సహాయం అందుతుంది. శత్రువులు ఎవరో.. మిత్రులు ఎవరో తెలుసుకోలేకపోతారు. బంధుమిత్రుల సలహాలు సూచనలు పాటించకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు. ప్రణాళిక లేకపోవడం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. అలసట పెరుగుతుంది. శివారాధన చేస్తే మంచిది.
మకరం
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆపదలు తొలుగుతాయి. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం, అష్టలక్ష్మీ స్తోత్రం పఠిస్తే మంచిది.
కుంభం
మీ మీ రంగాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో వైరసూచన. మనస్తాపం, శ్రమ పెరుగుతుంది. గణపతి ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందగలరు.
మీనం
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారం అందులో మీకు తోడ్పడతాయి. ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల అనవసర ఖర్చులు వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.