ఈరోజు (04-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం వర్ష రుతువు; భాద్రపద మాసం
బహుళపక్షం త్రయోదశి: రా. 7.21 తదుపరి చతుర్దశి
పుబ్బ: రా. 2.17 తదుపరి ఉత్తర
వర్జ్యం: ఉ. 10.12 నుంచి 11.49 వరకు
అమృత ఘడియలు: రా.7.51 నుంచి 9.27 వరకు
దుర్ముహూర్తం: మ. 12.13 నుంచి 1.01 వరకు తిరిగి
మ.2.36 నుంచి 3.23 వరకు
రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు
సూర్యోదయం: ఉ.5-54, సూర్యాస్తమయం: సా.5-46
మేషం
ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.
వృషభం
చేపట్టే పనులకు ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అకారణ కలహ సూచన. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
మిథునం
లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. చేపట్టే పనుల్లో పట్టుదల వదలకండి. శివారాధన శుభప్రదం.
కర్కాటకం
తలపెట్టిన కార్యాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభదాయకం.
సింహం
శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభాన్నిస్తుంది.
కన్య
సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి. సమర్థతను పెంచాలి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
తుల
కొత్త పనులు చేపడతారు. తోటివారిని కలుపుకుపోవడం ద్వారా శీఘ్ర ఫలితాలు సొంతమవుతాయి. ఉత్సాహంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఇష్టదైవ శ్లోకాలు చదివితే మంచిది.
వృశ్చికం
శుభకాలం. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక వ్యవహారంలో అధికారుల మన్ననలు పొందుతారు. ప్రయాణ సౌఖ్యం కలదు. ఇష్టదైవారాధన శ్రేయోదాయకం.
ధనుస్సు
కష్టానికి తగిన ఫలితాలు సొంతమవుతాయి. నూతన కార్యక్రమాలను మొదలుపెట్టేముందు లాభ నష్టాలను అంచనా వేసుకొని ముందుకు సాగండి . ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రయాణాలు ఫలిస్తాయి. శివపార్వతుల సందర్శనం శుభప్రదం.
మకరం
మిశ్రమ కాలం. పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. అలసట పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. వేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.
కుంభం
ఆత్మీయుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. శ్రీరామనామాన్ని జపిస్తే మంచిది.
మీనం
పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. తోటివారిని కలుపుకుపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. లక్ష్మీదేవి ధ్యానం చేయండి.