ETV Bharat / bharat

Horoscope Today (03-10-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

Horoscope Today(03-10-2021): ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
నేటి మీ రాశిఫలం
author img

By

Published : Oct 3, 2021, 4:20 AM IST

ఈరోజు (03-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష రుతువు, భాద్రపద మాసం

బహుళపక్షం ద్వాదశి: రా. 7.48 తదుపరి త్రయోదశి

మఘ: రా. 2.11 తదుపరి పుబ్బ

వర్జ్యం: మ. 1.53 నుంచి 3.31 వరకు

అమృత ఘడియలు: రా. 11.43 నుంచి 1.21 వరకు

దుర్ముహూర్తం: సా. 4.11 నుంచి 4.59 వరకు

రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు

సూర్యోదయం: ఉ.5-54, సూర్యాస్తమయం: సా.5-47

మేషం

సౌభాగ్యప్రాప్తి కలదు. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. అవసరానికి సాయం చేసేవారు ఉంటారు. యశోవృద్ధి కలదు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నవదుర్గా స్తోత్రం పఠించాలి.

వృషభం

మిశ్రమకాలం. ఒత్తిడి పెరగకుండా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. కీలక వ్యవహారాలలో మీరు ఆశించిన సాయం అందుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఇంకా బాగుంటుంది.

మిథునం

ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధు,మిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైన ఆలోచనను ఆచరణలో పెడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కనకధారాస్తవం పారాయణ చేయడం వల్ల బాగుంటుంది.

కర్కాటకం

ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

సింహం

చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. జన్మరాశిలో చంద్రబలం యోగిస్తోంది. గణపతి ఆరాధన శుభప్రదం.

కన్య

కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకొని పోవడం వారి పనులు త్వరగా పూర్తవుతాయి. ఆదాయానికి తగినట్టు ఖర్చులు ఉంటాయి. గణపతి ఆరాధన శుభప్రదం.

తుల

పనిలో శ్రమ పెరిగినప్పటికీ మనోభీష్టం నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

వృశ్చికం

మంచి కాలం. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక శుభవార్త మనస్సంతోషాన్ని ఇస్తుంది. ఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.

ధనుస్సు

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. బాగా కష్టపడితే తప్ప పనులు పూర్తవ్వవు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి. మంచి జరుగుతుంది. ఆంజనేయ దర్శనం శుభప్రదం.

మకరం

మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని వార్తలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కనకధారాస్తవం పఠించాలి.

కుంభం

మీలోని నిబద్ధతే మిమ్మలి రక్షిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనోధైర్యాన్ని వదలకండి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

మీనం

మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అమవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయస్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.