ఈరోజు (26-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం;బహుళపక్షం
సప్తమి: రా. 12.15 తదుపరి అష్టమి
ఆశ్లేష: సా. 4.33 తదుపరి మఘ
వర్జ్యం: ఉ.శేష వర్జ్యం 6.24 వరకు తిరిగి తె. 4.57 నుంచి
అమృత ఘడియలు: మ. 2.51 నుంచి 4.32 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.27 నుంచి 9.11 వరకు; తిరిగి మ. 12.09 నుంచి 12.53 వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.6.14, సూర్యాస్తమయం: సా.5-20
మేషం
అవసరానికి సహాయం చేసేవారున్నారు. శ్రమ అధికం అవుతుంది. తోటివారి సహకారంతో ఆపదలు తొలగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శివారాధన మంచిది.
వృషభం
అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం ఫరవాలేదనిపిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మంచిది.
మిథునం
ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేసి, వాటిని ప్రారంభిస్తారు. శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం పఠించడం మంచిది.
కర్కాటకం
మనఃస్సౌఖ్యం ఉంది. ఉద్యోగులకు శుభకాలం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆంజనేయ స్తోత్రం పారాయణ మంచిది.
సింహం
శుభఫలితాలు సొంతం అవుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
కన్య
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మానవద్దు.
తుల
మంచి కాలం. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.
వృశ్చికం
ప్రారంభించబోయే పనుల్లో తోటివారి సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.
ధనుస్సు
ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శరీర సౌఖ్యం కలదు. శివ నామాన్ని జపించండి.
మకరం
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది.
కుంభం
శుభకాలం. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.
మీనం
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ మంచిది.
ఇదీ చూడండి : Gangs of Wasseypur: 'అతడ్ని చంపింది నేనే.. ఆరు నెలల్లో వారందరినీ లేపేసి...'