ఈరోజు(14-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తిక మాసం, శుక్లపక్షం
దశమి: ఉ. 8.43 తదుపరి ఏకాదశి
పూర్వాభాద్ర: రా. 7.46 తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: తె. 5.38 నుంచి
అమృత ఘడియలు: ఉ. 11.42 నుంచి 1.19 వరకు
దుర్ముహూర్తం: సా. 3.51 నుంచి 4.36 వరకు
రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు
సూర్యోదయం: ఉ.6.08, సూర్యాస్తమయం: సా.5-21 శ్రీ యాజ్ఞవల్క్య జయంతి
మేషం
దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. స్వకులాచారం ఉంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు. ఇష్టదేవతా స్మరణ ఉత్తమం.
వృషభం
విశేషమైన శుభఫలితాలున్నాయి. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అదృష్ట సిద్ధి కలదు. శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.
మిథునం
జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. ఆపదలు, కష్టాలు ఎదురవుతాయి. ఒక వార్త మనోవిచారాన్ని కలిగిస్తుంది. కలహ సూచన. ఆవేశాలకు పోవద్దు. శ్రమ అధికమవుతుంది. పనుల్లో విజయం కోసం లింగాష్టకం చదివితే మంచి జరుగుతుంది.
కర్కాటకం
సౌభాగ్య సిద్ధి ఉంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువుల సహకారం లభిస్తుంది. భోజన సౌఖ్యం ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. ఇష్టదేవతారాధన శుభప్రదం.
సింహం
అత్యంత శ్రేష్ఠమైన కాలం. మొదలుపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇష్టమైనవారితో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే శుభం కలుగుతుంది.
కన్య
చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మనః స్సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల సాయం లభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలున్నాయి. గిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభదాయకం.
తుల
మధ్యమ ఫలితాలున్నాయి. ఒత్తిడిని తగ్గించే మార్గాలను వెతకాలి. బంధుమిత్రులను కలుపుకుపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.
వృశ్చికం
ఆలోచనల్లో మార్పులు కలగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయంకలిగిస్తాయి. లింగాష్టకం చదివితే మంచిది.
ధనస్సు
మీ మీ రంగాల్లో శుభకాలం నడుస్తోంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధనలాభం ఉంది. అధికారుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు సఫలమవుతాయి. చంద్రధ్యానం శుభప్రదం.
మకరం
చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధిస్తారు. వేంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆపదలు తొలగుతాయి.
కుంభం
కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. చేపట్టిన పనులను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. నారాయణ మంత్రాన్ని జపించాలి.
మీనం
దైవబలం ఉంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తారు. గిట్టనివారితో మిత సంభాషణ చేయడం మంచిది. సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం శుభప్రదం.