Horoscope Today (18-03-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం శిశిర రుతువు;
ఫాల్గుణ మాసం; శుక్ల పక్షం
పూర్ణిమ: మ. 1.06 తదుపరి బహుళపక్ష పాడ్యమి
ఉత్తర: రా. 12.57 తదుపరి హస్త
వర్జ్యం: ఉ.7.56 నుంచి 9.33 వరకు అమృత ఘడియలు: సా.5.39 నుంచి 7.16 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.34 నుంచి 9.21 వరకు తిరిగి మ.12.32 నుంచి 1.20 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.6.11, సూర్యాస్తమయం: సా.6.06
శ్రీ లక్ష్మీ జయంతి, హోలీ పూర్ణిమ
మేషం
మీ పనుల్లో బంధు,మిత్రులు సాయపడతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
వృషభం
మధ్యమ ఫలాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. చంద్రధ్యానం, దుర్గా ఆరాధన మేలైన ఫలితాన్ని ఇస్తుంది.
మిథునం
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కలహ సూచన ఉంది. ఆదిత్య హృదయం చదవాలి.
కర్కాటకం
శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ సహకారం ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.
సింహం
మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ముఖ్యమైన సమయంలో సహాయం అందుతుంది. బాధ్యతలను గుర్తెరిగి పనిచేయండి. చక్కటి శుభఫలితాలను పొందుతారు. శ్రీవిష్ణు దర్శనం ఉత్తమం.
కన్య
లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకు సాగాలి. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.
తుల
చంచల స్వభావం వల్ల ఆటంకాలు పెరుగుతాయి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. దుర్గారాధన మంచిది.
వృశ్చికం
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో తరచూ నిర్ణయాలు మార్చి ఇబ్బందులు పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. దైవారాధన మానవద్దు.
ధనస్సు
ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులను మధ్యాహ్నం తర్వాత చేయడం మంచిది. ఇష్టదైవారాధన శుభప్రదం.
మకరం
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.
కుంభం
మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ దర్శనం శుభప్రదం.
మీనం
ముఖ్య విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.