Horoscope Today (08-03-2022): ఈ రోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
![](https://assets.eenadu.net/article_img/mesham_2_5.jpg)
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/vrushabam_6.jpg)
మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/midhunam_6.jpg)
ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. తోటివారి సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు. ఎట్టి పరిస్థితిలోనూ మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లక్ష్మీ నామాన్ని జపించడం ఉత్తమం.
![](https://assets.eenadu.net/article_img/karkatakam_2_5.jpg)
కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది.
![](https://assets.eenadu.net/article_img/simham_1_5.jpg)
పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
![](https://assets.eenadu.net/article_img/kanya_1_5.jpg)
బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
![](https://assets.eenadu.net/article_img/tula_1_5.jpg)
సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్యసిద్ధి ఉంది. ఇష్టదేవతా స్తోత్రం చదవడం మంచిది.
![](https://assets.eenadu.net/article_img/vruschikam_7.jpg)
మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభాన్ని పొందుతారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.
![](https://assets.eenadu.net/article_img/dhanussu_6.jpg)
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బంది పడతారు. దుర్గాధ్యానం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
![](https://assets.eenadu.net/article_img/makaram_3_4.jpg)
శ్రమ ఫలిస్తుంది. ముఖ్య వ్యవహారాల విషయమై పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు. ఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
![](https://assets.eenadu.net/article_img/kumbam_1_6.jpg)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.
![](https://assets.eenadu.net/article_img/meenam_2_6.jpg)
దైవబలం సంపూర్ణంగా ఉంది. మానవ ప్రయత్నం బలంగా చేయాలి. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.