Horoscope Today (02-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడాల్సి వస్తుంది. సహనం కోల్పోరాదు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీ సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. గణపతి సహస్రనామ పారాయణ శుభప్రదం.
శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీదేవి దర్శనం శుభకరం.
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపు పూర్తి కావొస్తుంది. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది.
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహకారం అందుతుంది. మనః స్సౌఖ్యం ఉంది. శివారాధన మంచిది.
ప్రారంభించబోయే పనుల్లో ముందస్తు ప్రణాళికలు మేలు చేస్తాయి. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. చంద్ర ధ్యానం శుభప్రదం.
శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖసౌఖ్యాలు కలవు. ఒక వార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.
శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించేవారు ఉన్నారు జాగ్రత్త. సాయినామాన్ని జపించాలి.
కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం ఉత్తమం.
చేపట్టబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్ధిక విషయాల్లో పొదుపు సూత్రాన్నిపాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలను తొలగించుకునేందుకు శ్రీవేంకటేశ్వరుణ్ణి పూజించాలి.