ETV Bharat / bharat

Horoscope Today (30-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

ఈ రోజు రాశిఫలాలు (Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలం
author img

By

Published : Nov 30, 2021, 4:30 AM IST

ఈరోజు (30-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం; శరదృతువు కార్తిక మాసం

బహుళపక్షం; ఏకాదశి: రా. 9.48 తదుపరి ద్వాదశి

హస్త: సా. 5.01 తదుపరి చిత్త

వర్జ్యం: రా.12.43 నుంచి 2.16 వరకు

అమృత ఘడియలు:ఉ. 11.09 నుంచి 12.43 వరకు

దుర్ముహూర్తం: ఉ. 8.28 నుంచి 9.13 వరకు తిరిగి రా.10.30 నుంచి 11.22 వరకు

రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు

సూర్యోదయం: ఉ.6.16, సూర్యాస్తమయం: సా.5-20, సర్వైకాదశి

మేషం..

కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. విష్ణు సహస్రనామం చదివినా విన్నా మంచిది.

వృషభం..

ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. శని ధ్యానం శుభప్రదం.

మిథునం..

ప్రారంభించబోయే పనుల్లో పనుల్లో స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జపించాలి.

కర్కాటకం..

శ్రమ అధికం అవుతుంది. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ఆవేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. గోవింద నామాలు చదవడం వల్ల పనులలో విజయంతో పాటు మంచి జరుగుతుంది.

సింహం..

విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది.

కన్య..

కీలక వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. లలితాదేవి నామాన్ని స్మరించాలి.

తుల..

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబసభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. చంచల స్వభావంతో ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. చంద్ర శ్లోకం చదవాలి.

వృశ్చికం..

ప్రారంభించబోయే పనులలో విజయావకాశాలు ఉన్నాయి. మనః సౌఖ్యం ఉంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధుజన సహకారం ఉంటుంది. దైవబలం సంపూర్ణంగా ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

ధనస్సు..

ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీలోని ఓర్పు,సహనం మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

మకరం..

పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో మంచి ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. సాయిబాబా దర్శనం శుభప్రదం.

కుంభం

అలసత్వం లేకుండా పనిచేస్తే గొప్ప ఫలితాలు సాధిస్తారు. హుషారుగా ముందుకు సాగండి. కీలక విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే వివాదాలు చుట్టుముడతాయి. చెడుసావాసాల వల్ల మనోవిచారం కలుగుతుంది. ఎవరినీ అతిగా నమ్మకండి. శనికి తైలాభిషేకం శుభప్రదం.

మీనం..

శుభకాలం. ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తవుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం మేలు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.