Horoscope Today 9th October 2023 : అక్టోబర్ 9న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు మీరు చాలా సున్నితంగా ఉంటారు. మీ అమ్మగారి ఆరోగ్యం జాగ్రత్త. ధ్యానం, యోగాభ్యాసం చేయండి. మీ ఇల్లు లేదా ఆస్తులకు సంబంధించిన చట్టపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండటం మంచిది.
వృషభం (Taurus) : ఈ రోజు మీరు ఉల్లాసంగా ఉంటారు. సంతోషంగా గడుపుతారు. అద్భుత ప్రదేశాల్లో షికారు చేయండి. ఈ రోజు మీకు అందంగా కనిపిస్తుంది.
మిథునం (Gemini) : ఈ రోజు బంధువులు, ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. మీకు ఆర్థిక సమస్య ఉంటే వాటికి కాస్త సమయం కేటాయిస్తారు. మొదట ఇబ్బంది ఉన్నా.. తర్వాత పరిస్థితులన్నీ సానుకూలంగా మారుతాయి. వృత్తి రంగాల్లో వారికి కూడా ఇది మంచి సమయం. ఆర్థిక లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
కర్కాటకం (Cancer) : ఈ రోజు సంతోషంగా గడపండి. కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అవి స్నేహితులు, బంధువులు లేదా మీ భాగస్వామి నుంచి ఎదురుకావచ్చు. మీ ప్రియమైన వారితో అందమైన ప్రదేశాల్లో గడిపే అవకాశం ఉంది.
సింహం (Leo) : ఈ రోజు కొన్ని ఘటనలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వివాదాలకు దూరంగా ఉండండి.
కన్య (Virgo) : ఈ రోజు మీకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు సంపద కలుగుతుంది. ప్రశాంతమైన ప్రయాణం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణంలో మీ భాగస్వామితో మంచి బంధం ఏర్పడుతుంది.
తుల (Libra) : ఇంట్లో ఆనందకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది. మీ సామర్థ్యంతో మెప్పు పొందుతారు. ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతోషంగా గడుపుతారు.
వృశ్చికం (Scorpio) : ఈరోజు మీరు చాలా భావోద్వేగంతో ఉంటారు. జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకోని మలుపులు తిరిగే సంఘటనలు ఉండే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తిపరమైన విషయాల్లో అధికారులు ఒక్కసారి సంతృప్తి, ఇంకోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మీరంటే గిట్టని వాళ్లున్నారు. ప్రయాణాలు, ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు.
ధనుస్సు (Sagittarius) : ఊహించని సంఘటనలతో ఈ రోజు ఉంటుంది. ఈ రోజు మీరు తీరిక లేకుండా గడుపుతారు. సమస్యలను ఈ రోజు పరిష్కరించే ప్రయత్నం చేయకండి. అధిక సున్నితత్వం కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీ భాగస్వామితో వ్యవహరించేటప్పుడు లౌక్యంగా ఉండండి. గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా మెలగండి.
మకరం (Capricorn) : వివిధ ఉత్పత్తులకు సంబంధించిన ఫ్రాంచైజీ మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. కమీషన్, వ్యాపారం, వడ్డీ, రుణాలు, పెట్టుబడులు, మీ ఆదాయాన్ని పెంచుతాయి. భారీ లాభాలను వచ్చే సూచనలు ఉన్నాయి. పిల్లల చదువులు కొంత ఆందోళన కలిగిస్తాయి.
కుంభం (Aquarius) : ఈ రోజు మీరు అన్ని రంగాల్లో విజయాన్ని అందుకుంటారు. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తి, ఆనందాన్ని ఇస్తాయి. ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. మీ మానసిక స్థితి ఆలోచనలకు దారితీసేదిగా ఉంటుంది.
మీనం (Pisces) : ఈ రోజు మీ సృజనాత్మకతంగా వ్యవహరించండి. మీలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాల్సి ఉంటుంది. ఒత్తిడి లేకుండా ఉండండి. మీరు రాయడం, చదవడం ఉన్న కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల చదువుల్లో రాణిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడాలి.