Horoscope Today 8th October 2023 : అక్టోబర్ 8న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి ఏ మాత్రం అనుకూలంగా లేదు. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకూడదు. శాంతియుతంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో అనుకోని ఆటుపోటులు వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.
వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారికి బాగుంటుంది. ఆందోళనలు, ఒత్తిళ్లు నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీలోని సృజనాత్మకతను వెలికితీస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఎంత కష్టపడినా.. ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దాచి పెడతారు. మీరు చేసిన పనికి తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగులకు తోటివారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి అనుకూలంగా ఉంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య అనుబంధం, ఆప్యాయత పెరుగుతాయి. భార్య నుంచి మంచి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి.
సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. మీ తారాబలం చాలా బలహీనంగా ఉంది. కనుక ప్రియమైన వారితో వాగ్వాదాలకు దిగకూడదు. గొడవలు, కొట్లాటలకు దూరంగా ఉండాలి.
కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి కలిసి వస్తుంది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న వ్యక్తులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా రాణిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.
తుల (Libra) : ఈ రోజు తుల రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంట్లో, కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. పై అధికారుల ప్రశంసలు కూడా అందుకుంటారు. ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.
వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు ఎదురుకావచ్చు. పిల్లల ఆరోగ్యం విషయంలో ఆందోళన పడే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకోకపోవడం మంచిది. రాజకీయపరమైన ఇబ్బందులు ఎదురుకావచ్చు. జాగ్రత్త! అయితే మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. దైవ ప్రార్థన మానసిక శాంతిని కలుగజేస్తుంది.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి అంత అనుకూలంగా లేదు. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. తీరికలేకుండా పనిచేయాల్సి ఉంటుంది. మానసికి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు కాస్త లౌక్యంగా ఉండండి.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా బాగా లాభపడతారు. ఏ పని చేసినా విజయవంతం అవుతారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారికి కలిసి వస్తుంది. ఇవాళ మీరు అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలోనూ అంతా బాగుంటుంది.
మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారి తారాబలం బాగుంది. కొత్త అవకాశాలు కోరి వస్తాయి. విద్యార్ధులు చదువుల్లో రాణిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.