Horoscope Today 3rd October 2023 : అక్టోబర్ 3న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మీ ఆస్తులకు సంబంధించిన మీలో ఆందోళన ఉంటుంది. వాటిని ఇతరులతో పంచుకోలేరు. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. మీ వైవాహిక జీవితం కూడా బాగుంటుంది.
వృషభం (Taurus) : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. పని మీద నిశితమైన దృష్టి కేంద్రీకరిస్తారు. విజయవంతంగా ఆ పనులను పూర్తి చేస్తారు. ఈ రోజు ఆర్థికంగానూ మీకు బాగుంటుంది. ఇంటి వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.
మిథునం (Gemini) : మీరు ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సమయానికి అననుకూలంగా నడుచుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేకుంటే ఆరోగ్య సంబంధమైన సమస్యలు, అనవసరమైన వివాదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబ సభ్యుల మనస్సును గాయపరచవచ్చు. ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి.
కర్కాటకం (Cancer) : ఈ రోజు మీకు బాగుంటుంది. వ్యాపార, ఆర్థిక పరమైన లబ్ధిని పొందుతారు. ఫండ్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఇది సరైన సమయం. మీ స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. బ్రహ్మచారులకూ, కుమారీలకూ వివాహ సంబంధాలు చూడొచ్చు. త్వరలోనే మీరు కోరుకున్న వ్యక్తి మీకు దొరుకుతారు. పిక్నిక్కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి.
సింహం (Leo) : మీ సానుకూల ఆలోచనలలో మీ కృత నిశ్చయం కనిపిస్తుంది. మీరు సామాజికంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీ తండ్రిగారితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. ఆయన వల్ల మీకు లాభం చేకూరవచ్చు. ఆస్థి సంబంధిత సమస్యలు తొలగిపోచ్చు.
కన్య (Virgo) : ఈ రోజు మీరు అలసట, బద్ధకంతో ఉంటారు. రోజంతా వ్యతిరేక పరిస్థితులే ఎదురైనట్టు ఉంటుంది. పిల్లల ఆరోగ్యం కాస్త దిగులుపరుస్తుంది. మీరు మీ పై అధికారుల నుంచి వచ్చే విమర్శలు మీ అభివృద్ధికి తోడ్పడగలవు. ప్రత్యర్థులపై గెలిచేందుకు ప్రయత్నించండి.
తుల (Libra) : మీరు ఈ రోజు మీరు జాగ్రత్త ఉండాలి. వివాదాల జోలికి వెళ్లవద్దు. కోపాన్ని అదుపులోకి ఉంచుకోండి. ఈ రోజు అనుకోని ఆర్థిక లాభం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై మీద ఆసక్తి ఉంటుంది.
వృశ్చికం (Scorpio) : ఈ రోజు సరదాగా, సంతోషంగా ఉంటారు. మీ స్నేహితులతో టూర్కు వెళ్లే అవకాశం ఉంది. కొత్త దుస్తులు కొంటారు. సంఘంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం అన్నీ కలిసి వస్తాయి. ఇంటి వాతావరణంలో సమన్వయ ధోరణి ఉంటుంది. రోజంతా చురుగ్గా ఉంటారు. సహోద్యోగులు నుంచి సహకారం అందుతుంది. ఆర్థిక లాభం ఉంటుంది.
మకరం (Capricorn) : మీరు రోజులో ఎక్కువ భాగం విచారం, చింత ఉంటుంది. తల్లిదండ్రులూ, పిల్లల ఆరోగ్య సంబంధమైన విషయాలపై శద్ధ పెట్టాలి. ఈ రోజు మిమ్మల్లి మీపై అధికారులు మెచ్చుకుంటారు. వాదనల్లోకి దిగవద్దు.
కుంభం (Aquarius) : ఈ రోజు మీరు మానసికంగా కాస్త సున్నితంగా ఉండొచ్చు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆడవారు సౌందర్య సామాగ్రిని కొంటారు. ఖర్చులను అదుపులోకి ఉంచుకోండి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి . మీ పరిణితి చెందిన వ్యక్తిలా వ్యవహరించండి.
మీనం (Pisces) : ముఖ్యమైననిర్ణయాలు తీసుకోండి. ఈ రోజు మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి. విజయాన్ని అందుకుంటారు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ ప్రియమైన వారితో రహస్యాలను పంచుకుంటారు.