Horoscope Today 1st October 2023 : అక్టోబర్ 1న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి అంతా అనుకూలంగా ఉంటుంది. రోజంతా సుఖంగా, శాంతియుతంగా గడుస్తుంది. శారీరకంగా, మానసికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మాతృసంబంధీకుల నుంచి లాభం చేకూరుతుంది. స్నేహితులతో, బంధువులతో కలిసి ఆనందంగా ఉంటారు.
వృషభం (Taurus) : ఈ రోజు వృషభరాశికి అంత అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తగా, నిగ్రహంగా ఉండాలి. అయితే సమస్యలు ఎదురైనా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారికి అంతా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. పట్టింది అంతా బంగారం అవుతుంది. పెట్టుబడులు అన్నీ మంచి లాభాలను అందిస్తాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది. సంబంధాలు బలపడతాయి.
కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి అదృష్టం కలిసివస్తుంది. సమయం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి సాధారణంగా గడుస్తుంది. మీరు అనుకున్న పనులు అన్నీ పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోపాన్ని కొంచెం అదుపు చేసుకుంటే బాగుంటుంది. అయితే పిల్లల విషయంలో కాస్త అసంతృప్తిగా ఉంటారు. వ్యాపారాల్లో మాత్రం కొద్ది పాటి అవరోధాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశి వారికి అంత అనుకూలంగా లేదు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. బాగా ఆలోచించి, ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త!
తుల (Libra) : ఈ రోజు తుల రాశివారికి అంతా బాగుంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారి తారాబలం చాలా బాగుంది. ఇప్పటి వరకు మీపై ఉన్న చెడు ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. పై అధికారుల సహకారం మీకు లభిస్తుంది. అయితే ఆడవారికి దూరం పాటించడం మంచిది.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనస్సు రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ప్రయాణాలు చేయకపోవడం మంచిది. పిల్లల ఆరోగ్యం విషయంలో కాస్త ఆందోళనగా ఉంటుంది. దైవ ప్రార్థన చేస్తే పరిస్థితులు కాస్త అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి ఏ మాత్రం అనుకూలంగా లేదు. ఆరోగ్యం క్షీణిస్తుంది. కుటుంబంలో మనస్పర్థలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికులు గొడవలు పడే అవకాశం ఉంది. అవమానకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.. జాగ్రత్త! శాంతి వహించడం ఉత్తమం. నీటికి కూడా దూరంగా ఉండడం అవసరం. మొండితనం, నిర్లక్ష్యం మంచిది కాదు.
కుంభం (Aquarius) : ఈ రోజు కుంభరాశి వారు చాలా శాంతంగా ఉండాల్సి ఉంటుంది. ప్రతికూల ఆలోచనలను దరికి చేరనివ్వకూడదు. అప్పుడు మాత్రమే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో.. ఎదురైన సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు.
మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి మధ్యస్థంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ నమ్మరాదు. అవాంఛనీయ సంఘటనలు జరిగి.. మీ బంధువులతో మనస్పర్థలు చెలరేగే అవకాశం కనిపిస్తోంది. శాంతం వహించడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.